ETV Bharat / state

TDP Agitations Continues Against Chandrababu Arrest: వైసీపీ సర్కారుపై ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబుకు మద్దతుగా ముప్పేట ఆందోళనలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 7:39 PM IST

TDP Agitations Continues Against Chandrababu Arrest : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని నియోజకవర్గాలలో టీడీపీ నేతలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. "బాబుతో మేము" అంటూ నినదిస్తున్నారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

TDP_Leaders_Agitations_Continues_Against_Chandrababu_Arrest
TDP_Leaders_Agitations_Continues_Against_Chandrababu_Arrest

TDP Agitations Continues Against Chandrababu Arrest : అనంతపురంలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. గుమ్మడికాయలపై జగన్ వైరస్‌ అని రాసి వాటిని పగలగొట్టారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష చేశారు. చంద్రబాబు త్వరగా జేలు నుంచి విడుదల కావాలని కోరుతూ కర్నూలు జిల్లా గోనెగండ్లలోని చింతలముని నల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మిగనూరు కూడలలిలో రిలే నిరాహార దీక్ష చేశారు. ఆదోని కళ్ళు గీత కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్ళు తీసే కుండల పై 'బాబు కోసం మేము సైతం' అని రాసి... సైకో పోవాలి.... సైకిల్ రావాలని గోవింద నామాలతో నినాదాలు చేశారు.

TDP Agitations Continues Against Chandrababu Arrest: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆగ్రహ జ్వాలలు.. విశ్రమించిన తెలుగు తమ్ముళ్లు

Old Women Crying on Chandrababu Arrest: 'చంద్రబాబు తప్పు చేయడు.. ఆయన బయటకు రావాలి..' కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు
TDP Cadre Protest in AP Against CBN Arrest : నెల్లూరు శ్రీ వెంగమాంబ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన నారసింహ హోమం చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో టీడీపీ మహిళా నేత వేగుంట రాణి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు కొనసాగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేస్తున్న దీక్షకు మద్దతుగా... మంగళగిరి మండలం వడ్లపూడికి చెందిన సుమారు 150 కుటుంబాలు దీక్షలో పాల్గొన్నాయి.

TNSF Leaders Hunger Strike Against Chandrababu Arrest : బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల నుంచి రాచపూడి వరకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేశారు. విజయవాడలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు పొట్లూరి దర్షిత్, రేపాకుల శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్తలు చేపట్టిన నిరాహార దీక్షలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.

TDP Leaders Protests by Across the State Against CBN Illegal Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు

చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పెదపాడులో రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో రైతులు దీక్షలో పాల్గొన్నారు. కూరగాయలు, పూతరేకులతో "ఐ యామ్‌ విత్‌ CBN” అని రాశారు.

Old Women Crying on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాజమహేంద్రవరంలో ఓ స్థానిక వృద్ధురాలు.. భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తంచేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జి. దొంతమూరులో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం సముద్రతీరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు జల దీక్ష చేశారు. విశాఖ ఎమ్​వీవీ కాలనీలో తెలుగు మహిళలు బిక్షాటన చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసులు అధ్వర్యంలో టీడీపీ శ్రేణలు చేతికి బేడీలు వేసుకుని చంద్రబాబుకు మద్దతు తెలిపారు.

Huge Rally in Nellore Against Chandrababu Illegal Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై నెల్లూరులో భారీ ర్యాలీ.. హోరెత్తిన నినాదాలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.