ETV Bharat / state

వైసీపీ సమర్పించు సామాజిక సాధికార 'వైఫల్య' యాత్ర-సభల వైపు కన్నెత్తి చూడని జనం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 7:35 AM IST

Updated : Nov 18, 2023, 10:28 AM IST

No Response to YSRCP Samajika Sadhikara Bus Yatra: సామాజిక సాధికార అనేది ఆచరణలో చూపితే.. మాటలు చెప్పాల్సిన పని ఉండదు. అయినా అధికార వైఎస్సార్సీపీ నాయకులు బస్సు యాత్ర చేపట్టి.. సామాజిక న్యాయం చేసేశామంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎస్సీ, ఎస్టీలకు అమల్లో ఉన్న 27 పథకాలను రద్దు చేసి.. ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించి.. మాటల్లో మాత్రం సామాజిక న్యాయం గురించి చెబుతుంటే ఎవరైనా పట్టించుకుంటారా? అందుకే వైఎస్సార్సీపీ చేపట్టే సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. బస్సుయాత్రలు కాస్త తుస్సుమంటున్నాయి.

No_Response_to_YSRCP_Samajika_Sadhikara_Bus_Yatra
No_Response_to_YSRCP_Samajika_Sadhikara_Bus_Yatra

వైసీపీ సమర్పించు సామాజిక సాధికార 'వైఫల్య' యాత్ర-సభల వైపు కన్నెత్తి చూడని జనం

No Response to YSRCP Samajika Sadhikara Bus Yatra : సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు (YCP Public Meetings) జనం లేక ఎలా వెలవెలబోతున్నాయో భయపెట్టి, డబ్బు వెదజల్లి ప్రజలను తీసుకువచ్చినా సభ ముగిసే వరకూ వారు అక్కడ ఉండడం లేదు. ఖాళీ కుర్చీలను ఉద్దేశించే నాయకులు ప్రసంగించి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది.

Public Reject Samajika Sadhikara Bus Yatra in AP : జనవరిలో ప్రభుత్వం ఇచ్చే 'ఆసరా (Aasara)' నిధులు ఖాతాల్లోకి జమ కావాలంటే అధికార పార్టీ సభలకు రావాల్సిందే అంటూ డ్వాక్రా సంఘాల మహిళలను బెదిరించి మరీ తీసుకొస్తున్నారు. కొన్నిచోట్ల డ్వాక్రా మహిళలు రాకపోతే 200 రూపాయల చొప్పున జరిమానా వేస్తున్నారు. సంఘాల వారీగా సభ్యులు ఎవరెవరు వస్తున్నారు? ఎవరు రాలేదనే వివరాలను వాలంటీర్లు నమోదు చేసుకుంటున్నారు. బెదిరింపులతో మహిళలు విధిలేక సభలకు హాజరవుతున్నారు. రాకపోతే పింఛన్‌ ఆపేస్తామంటూ వృద్ధులు, వితంతువులనూ సభలకు తరలిస్తున్నారు. బలవంతంగా వచ్చినా సభలో కూర్చొనే ఓపిక లేక చాలా మంది తీసుకువచ్చిన వాహనాల్లోనే ఉండిపోతున్నారు.

Samajika Sadhikara Bus Yatra Public Meeting : ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు : గురువారం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో సభలో ఓ వైపు ప్రసంగాలు సాగుతుండగానే వేదిక ఎదురుగా ఉన్న కుర్చీలు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ కుర్చీలను తొలగించారు. మిగిలిన వారిని వేదిక సమీపానికి వచ్చి కూర్చోవాలంటూ నేతలే బతిమాలుకున్నారు. నరసన్నపేటలో జరిగిన సభలోనూ మొదటి వక్త ప్రసంగం మొదలవగానే జనం వెళ్లిపోవడం ప్రారంభించారు. తర్వాత ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు ఖాళీ కుర్చీలకే ప్రసంగాలు వినిపించారు. 15 రోజులుగా సాగుతున్న బస్సు యాత్రల్లో మొదటి ఒకటి రెండు రోజులు మినహా దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి.

వైసీపీ సభలంటే హడలిపోతున్న ప్రజలు.. ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు ఇస్తూ సంబరపడుతున్న నేతలు

సామాజిక సాధికార యాత్రపై దళిత సంఘాలు ఆగ్రహం : 'ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.. మంత్రి పదవి వచ్చింది.. ఎంపీని చేశారు' అని చెప్పడం తప్ప వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రయోజనాల కోసం ఏం చేశారో ఎవరూ చెప్పడం లేదు. ఏం చేశారు..ఏం సాధించారు అనేది చెప్పుకోకుండా ప్రతిపక్ష నేతలను తిట్టిపోయడానికే సమయం వెచ్చిస్తున్నారు. దళితుల పథకాల రద్దు, ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపు, విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు తొలగింపు.. వంటి ఘనకార్యాలను వెలగబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని మంత్రులు, నేతలకు సామాజిక సాధికార యాత్ర చేసే అర్హతే లేదని.. దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. 'వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 981లో 742 పోస్టులను ఒకే వర్గానికి ఇవ్వడం సామాజిక న్యాయమా' అని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో దళితుల వరుస హత్యలు, శిరోముండనాలు, అధికార పార్టీ ఎమ్మెల్సీనే ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేయడం..పైగా ఆ నాయకుడు దర్జాగా ముఖ్యమంత్రితోనే సభా వేదికలను పంచుకోవడంపై విజయవాడలో ఇటీవల దళిత సంఘాలు ప్రశ్నించాయి.

ఖాళీ కుర్చీలకు వైసీపీ నేతల ప్రసంగాలు - అధికార పార్టీ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్

వైసీపీ నేతల విభేదాలు బహిర్గతం చేసిన బస్సు యాత్ర : పేరుకు సామాజిక యాత్ర అయినా.. ఉత్తరాంధ్రలో వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. పల్నాడు, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి నేతల పర్యవేక్షణలోనే సాగుతోంది. తమకు ప్రాధాన్యమివ్వడం లేదని ఆయా జిల్లాల్లోని కీలక నేతలు అలకబూనుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి కనిగిరి నియోజకవర్గంలో యాత్రకు దూరంగా ఉన్నారు. సాయిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది వారి అసంతృప్తికి కారణం. గురువారం కొత్తపేటలో జరిగిన సభలో జిల్లాకు చెందిన మంత్రి విశ్వరూప్‌ కనిపించలేదు. స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డితోపాటు, ఎంపీ అనురాధతో మంత్రికి ఉన్న విభేదాలే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది.

పోలీసుల ఆంక్షలు : వైఎస్సార్సీపీ నాయకుల బస్సు యాత్ర వేళ.. పోలీసులు విధిస్తున్న ఆంక్షలతో జనం అవస్థలు పడుతున్నారు.

వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కోసం సామాన్య ప్రజలకు ఇక్కట్లు

Last Updated : Nov 18, 2023, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.