Padayatra: మహా పాదయాత్రకు ఈరోజు విరామం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులు

author img

By

Published : Sep 27, 2022, 3:08 PM IST

Maha Padayatra

Maha Padayatra: రాజధాని పరిరక్షణ కోసం గత కొద్దిరోజులుగా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల పాదయాత్ర ఏలూరుకు చెరుకుంది. ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో రైతులకు బస ఏర్పాటు చేశారు. ఈ రోజు రైతులు పాదయత్రకు విరామం ఇచ్చారు. రైతులు, మహిళలు అంతా కలిసి స్థానికులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటపాటలతో చిందులేశారు.

Farmers Maha Padayatra: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో భాగంగా కిలోమీటర్ల కొద్దీ రోడ్లపై నడిచి అలసిన రైతులు మంగళవారం యాత్రకు విరామం ఇచ్చారు. ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో బస చేస్తున్న రైతులంతా.. ఉల్లాసంగా గడిపారు. మహిళల కోసం మాజీ ఎంపీ మాగంటి బాబు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆటపాటలు, జానపద గీతాలకు విద్యార్థులు నృత్యం చేసి రైతుల్లో ఉత్సాహం నింపారు. జయహో అమరావతి అనే గీతానికి వేదికపై కళాకారులు నృత్యం చేస్తుండగా.. వారితో కలిసి మహిళలు, రైతులు, నాయకులు కండువాలు ఊపుతూ సరదాగా గడిపారు.

పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్దతుగా పలు పార్టీల నాయకులు, వృద్ధులు, న్యాయవాదులు కల్యాణ మండపానికి వచ్చారు. కైకలూరుకు చెందిన రాధాకృష్ణ, ఏలూరుకు చెందిన సీనియర్ వైద్యులతో పాటు పలువురు పాదయాత్ర కోసం మాగంటి బాబు చేతుల మీదుగా విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు పాదయాత్ర చేయడంతో తమ కాళ్లకు అయిన గాయాలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.