సోషల్ మీడియాలో భార్య రీల్స్​.. వద్దని భర్త వార్నింగ్.. చివరకు దారుణంగా...

author img

By

Published : Sep 27, 2022, 1:24 PM IST

Updated : Sep 27, 2022, 6:16 PM IST

husband kills wife

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు బక్సర్​ రైల్వే స్టేషన్​లో వివాహితపై అత్యాచారం జరిగింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు ముందుకు రాలేదు.

బిహార్​ భోజ్​పుర్​లో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని ఆగ్రహించిన ఓ భర్త.. భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు అనిల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాదం ఆరా సమీపంలోని నవాడా పోలీస్ స్టేషన్​ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నూ ఖాతూన్​, అనిల్​కు 10 ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలు వేరే కాపురం ఉన్న ఈ దంపతులు మళ్లీ.. అనిల్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. సోషల్ మీడియాలో అన్నూ రీల్స్ చేస్తుండేది. భార్య అలా చేయడం ఆమె భర్త అనిల్​కు నచ్చలేదు. దీంతో దంపతుల మధ్య ఇదే విషయంపై తరచుగా గొడవలు జరిగేవి. మొబైల్​లో ఉన్న సోషల్ మీడియా యాప్​ను డిలీట్ చేయమని అనిల్​ ఆమెను కోరాడు. ఇందుకు అన్నూ నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనిల్ భార్యపై కోపంతో గొంతు నులిమి హత్యచేశాడు. రాత్రంతా భార్య మృతదేహం వద్దే కూర్చున్నాడు.

సమాచారం అందుకున్న నవాడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్​ను అదుపులోకి తీసుకున్నారు.'నా భార్య వీడియోలను స్నేహితులు, సన్నిహితులు చూసి హేళన చేస్తున్నారు. వీడియోలు చేయడం ఆపేయమని చాలాసార్లు హెచ్చరించాను. అయినా వినలేదు. అందుకే చంపేశా' అని పోలీసుల విచారణలో అనిల్ తెలిపాడు.

"ఆదివారం రాత్రి నా కుమారుడు, కోడలు ఇంటి రెండో అంతస్తులోని తమ గదిలో నిద్రించడానికి వెళ్లారు. సోమవారం ఉదయం నా భార్య రూమ్​ను శుభ్రం చేసేందుకు పైకి వెళ్లగా.. గది లోపల నుంచి తాళం వేసి ఉంది. తలుపు కొట్టినా ఎవరూ తెరవడం లేదు. బలవంతంగా తలుపు తీసి చూడగా లోపల అన్నూ మృతదేహం కనిపించింది. అనిల్ పక్కనే కూర్చున్నాడు. తానే తన భార్యను చంపినట్లు నా కుమారుడు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. "

--శివశంకర్ , నిందితుడి తండ్రి

రైల్వే స్టేషన్​లో..
బిహార్.. బక్సర్​ రైల్వే స్టేషన్​లో వివాహితపై అత్యాచారం జరిగింది. స్థానికులు.. బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రి యజమాన్యం పోలీసులకు సమాచారం అందించినా ఎవరూ ఘటనాస్థలికి రాలేదు. ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స పొందుతోంది.

ఘటనాస్థలం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని బక్సర్​ సిటీ పోలీసులు, రైల్వే పోలీసులు.. ఎవరూ ఆసుపత్రికి చేరుకోలేదు. అత్యాచారం జరిగిన తర్వాత రైల్వే అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితురాలు తెలిపింది. ఈ విషయం రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి చేరడం వల్ల ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. రైల్వే పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో ఉన్నారు.

ఇవీ చదవండి: సుప్రీంకోర్టు విచారణలు లైవ్​లో చూడాలా? ఈ లింక్​పై క్లిక్ చేయండి!

ప్రభుత్వ ఆఫీసులో సామానంతా అమ్మేసిన ప్యూన్.. తలుపులు, కిటికీలు కూడా.. మందు కోసమే!

Last Updated :Sep 27, 2022, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.