ETV Bharat / state

Jailor Transfer రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ ఆకస్మిక బదిలీ..

author img

By

Published : May 5, 2023, 10:49 AM IST

Sudden transfer of Superintendent: జైలులో ఉన్నవారిని కలిసేందుకు.. తెలుగుదేశం పార్టీ నేతలను అనుమతించడమూ వైసీపీ ప్రభుత్వంలో అపరాధమే. అందుకే వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు.. గిరిజన అధికారిపై కన్నెర్ర చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం విధులు నిర్వర్తిస్తున్న సూపరింటెండెంట్‌ను ఆకస్మికంగా బదిలీ చేయించారు.

Sudden transfer of Superintendent
Sudden transfer of Superintendent

Sudden transfer of Superintendent: రోజురోజుకూ అధికార పార్టీ అరచకాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. జైల్లో ఉన్నవారిని కలిసేందుకు టీడీపీ నేతలను అనుమతించారని.. గిరిజన అధికారిపై వైసీపీ నేతలు కన్నెర్ర చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్​గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. రాజారావును ఆకస్మికంగా బదిలీ చేయించారు. సీఐడీ ఇటివలే అరెస్టు చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, ఆమె మామ, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు ఈ జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో వారిని పరామర్శించడానికి అనుమతిచ్చారనే నేపథ్యంలోనే కారాగారం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు పడింది. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేసి రాజమహేంద్రవరం కారాగారంలో ఉంచిన సమయంలోనూ రాజారావు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. టీడీపీ నేతలను జైలులో ఉన్న తమ నేతలను కలిసేందుకు ములాఖాత్ నిబంధనల మేరకు అక్కడకు అనుమంతించారనే ఉద్దేశంతో అప్పట్లో ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే, అంతకు ముందు ఆయన వివరణ కోరగా.. అందులో తప్పు లేదని తెలిసాక అక్కడే పోస్టింగ్ ఇచ్చారు.

మళ్లీ ఇప్పుడూ టీడీపీ నేతలను అనుమతించారని రాజారావును నెల్లూరు కేంద్ర కారాగారాల సిబ్బంది శిక్షణ కార్యాలయానికి ప్రిన్సిపల్‌గా నియమించారు. జైలులో ఉన్న వారికి రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, మిథున్ రెడ్డి ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి బదిలీ చేయించారని రాజారావు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మాలాంటి గిరిజనులకు బతికే అర్హత లేదంటూ రాజరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ లేకుండా చర్యలెలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వంలో మాలాంటి గిరిజనులకు బతికే అర్హత లేదు.. ‘ఇంత దుర్మార్గమా? ఎంపీ మార్గాని భరత్‌ అంట.. జైలులో టీడీపీ నేతలకు రాజభోగం చేస్తున్నారని మరో ఎంపీ మిథున్‌రెడ్డికి చెప్పారంట.. ఆయన సీఎం కార్యాలయానికి చెప్పి బదిలీ చేయించారంట.. ఈ ప్రభుత్వంలో మాలాంటి గిరిజనులకు బతికే అర్హత లేదు. నిబంధనల ప్రకారం పనిచేస్తుంటే.. ఎలా బదిలీ చేస్తారు? నా స్థానంలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఉంటే బదిలీ చేస్తారా? ప్రతిదానికీ ఒక విధానం ఉంటుంది కదా? ఎలాంటి విచారణ లేకుండా ఎలా చర్య తీసుకుంటారు? ఏం జరిగిందో వాస్తవం చూడరా?’ అని బదిలీ అయిన కారాగార సూపరింటెండెంట్‌ రాజారావు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేను నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాను. మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఫోన్‌ చేసి సార్‌.. 10 నిమిషాలు అనుమతి ఇప్పించాలని అడిగినా జైలు దగ్గర కనిపించవద్దు.. పరిస్థితులు బాగా లేవని చెప్పా. ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నా. హోం మంత్రి పేషీ నుంచి ఒకరు ఫోన్‌ చేసి తెలిసిన వాళ్లకు ఇంటర్వ్యూ చూడాలని కోరగా.. నిబంధనల ప్రకారం పోతున్నా. సారీ ఏమనుకోవద్దు, ఎవరినీ పంపవద్దని చెప్పా. నేను ఎంతో స్ట్రిక్ట్‌గా ఉన్నా. అయినా ఎలా బదిలీ చేస్తారు?’ అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.