ETV Bharat / state

జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

author img

By

Published : Aug 8, 2019, 5:42 AM IST

Updated : Aug 8, 2019, 12:42 PM IST

జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

కోనసీమలో ముంపు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారానికిపైగా జలదిగ్బంధంలోనే ఉన్న లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది. మోకాళ్ల లోతు నీటిలో బిక్కుబిక్కుమంటున్న జనం... వరద మళ్లీ పెరగడంతో ఈ పాట్లు ఎప్పటికి తీరతాయోనని ఆందోళన చెందుతున్నారు.

జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

కోనసీమను గోదావరి ముంపు బాధలు వెంటాడుతున్నాయి. వారం దాటినా వరదలు శాంతించడం లేదు. మోకాళ్ల లోతు నీటితో ప్రజల కష్టాలను ఎదుర్కొంటున్నారు. వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగటంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరద కారణంగా భారీగా పంటనష్టం చోటుచేసుకుంది.

మళ్లీ పెరిగిన వరద

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి మంగళవారం శాంతించినట్లు కనిపించినా... బుధవారం మళ్లీ ఉద్ధృతమైంది. ధవళేశ్వరం వద్ద లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నందున... దిగువ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భారీ మొత్తంలో జరిగిన పంట నష్టం.... రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి.

భారీగా పంట నష్టం

అమలాపురం డివిజన్ పరిధిలోని 12 మండలాలు, రామచంద్రాపురం డివిజన్‌లోని 2మండలాల్లో ముంపు పరిస్థితులు... ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తపేట, కాట్రేనికోన, ఐ.పోలవరం, రావులపాలెం, సఖినేటిపల్లి, మామిడికుదురు, తాళ్లరేవు, ముమ్మిడివరం, కె.గంగవరం మండలాల్లో రైతులకు తీరని వేదనే మిగిలింది. వేల రూపాయలు అప్పు చేసి పంటలు వేస్తే... మొత్తం తుడిచి పెట్టుకుపోయిందని వాపోతున్నారు


అస్తవ్యస్తంగా ప్రజల దుస్థితి

తూర్పుగోదావరి జిల్లాలో 12మండలాల పరిధిలోని 61గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయలు, అరటి, బొప్పాయి, పూలు... ముంపు బారిన పడ్డాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి వడి కాస్త తగ్గినా... వరద ముంపు కొనసాగుతుండటం కోనసీమ వాసులను బెంబేలెత్తిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన జీవనం ఎప్పుడు గాడిన పడుతుందోనని ప్రజలు నిరీక్షిస్తున్నారు.

ఇదీచదవండి

పోలవరంపై కేంద్రం సీరియస్‌... అనుమతులు రద్దు చేయమంటారా?

Intro:ap_knl_14_07_juda_nirasana_ab_ap10056
ఎన్ ఎం సి బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్ లో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి విజయవాడ లో వైద్య విద్యార్థులపై పోలీసులు చేయ్యి చేసుకోవడం దారుణమని వారు నిరసిస్తూ కర్నూల్ లో కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను వైద్య విద్యార్థులు అడ్డుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేట్లు మూసివేసి గేట్ల ముందు వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూడాలపై చేసుకున్న పోలీస్ అధికారులు వెంటనే క్షమాపణ చెప్పాలని అరెస్ట్ చేసిన జూనియర్ వైద్యులను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు
బైట్. వైద్య విద్యార్ధి



Body:ap_knl_14_07_juda_nirasana_ab_ap10056


Conclusion:ap_knl_14_07_juda_nirasana_ab_ap10056
Last Updated :Aug 8, 2019, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.