ETV Bharat / state

రీ అడ్మిషన్‌ పేరుతో ఉత్తుత్తి ప్రవేశాలు చూపుతున్న సర్కారు - చందాలు వేసుకుని ఫీజులు చెల్లిస్తున్న ఉపాధ్యాయులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 2:19 PM IST

_dropots_in_andhrapradesh
_dropots_in_andhrapradesh

Dropots in Andhrapradesh : విద్యా సంస్కరణలు తెచ్చామని సీఎం జగన్‌ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. అందుకే ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. పదో తరగతి, ఇంటర్‌ తప్పిన విద్యార్థులు రీ-అడ్మిషన్‌ ద్వారా రెగ్యులర్‌ విద్యార్థులుగా చదువుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. పరీక్ష తప్పిన వారు బడికి రాకపోయినా, నమోదు చేసుకొని, హాజరు వేయాలని చెప్పింది. అక్కడితో ఆగని ప్రభుత్వం... లేని విద్యార్థులకు పరీక్ష ఫీజు కట్టాలంటూ పాఠశాల యాజమాన్యాల మెడపై కత్తి వేలాడదీసింది.

Dropouts in Andhrapradesh : వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తట్టుకోలేకపోతున్నామని విద్యాసంస్థల యాజమాన్యాలు వాపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 70 వేల మంది బడికి రాకపోయినా రికార్డుల్లో కొనసాగుతున్నారు. ఒక్క పాఠశాల విద్యలోనే ఇలా 93వేల మంది ఉన్నారు. ఈ సంఖ్యలను చూపుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇలా పాఠశాలలో లేని విద్యార్థులను ఉన్నట్లు చూపడం, వారి ఫీజులను కట్టడం కష్టంగా మారుతోందని విద్యాసంస్థల యాజమాన్యాలు వాపోతున్నాయి.

రీ అడ్మిషన్‌ పేరుతో ఉత్తుత్తి ప్రవేశాలు - చందాలు వేసుకుని ఫీజులు చెల్లిస్తున్న ఉపాధ్యాయులు

కరోనా తర్వాత తెలంగాణలో డ్రాపౌట్లు పెరిగాయి: యూడైస్

'వాస్తవానికి ఈ విద్యాసంవత్సరంలోనే... 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. కానీ, పదో తరగతి, ఇంటర్‌ తప్పిన విద్యార్థులకు తిరిగి ప్రవేశాలు కల్పించి వారితో పరీక్ష ఫీజు కట్టించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు అప్పగించింది ప్రభుత్వం. చదువు పూర్తయి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులు ఎక్కడున్నారో తెలియకపోయినా బడి నిధుల నుంచే ఫీజులు కట్టించుకుంటున్నారు.' -వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ అధ్యక్షుడు, శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఎన్టీఆర్ జిల్లా యూటీఎఫ్

బాలికల కంటే బాలురే ఎక్కువగా చదువు ఆపేస్తున్నారు.. ఆ జాబితాలో ఏపీ స్థానం ఎక్కడ

'తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఓ పాఠశాలలో 14 మంది పదో తరగతిలో ఫెయిలైతే 11మంది ఫీజును ఆ పాఠశాల ఉపాధ్యాయులే చెల్లించారు. కొన్ని కళాశాలల్లో అధ్యాపకులే చందాలు వేసుకొని కట్టారు. కొన్ని బడుల్లో ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు చెల్లించారు. చాలా మంది ప్రధానోపాధ్యాయులు 4 నుంచి 5 వేల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. ప్రైవేటు యాజమాన్యాలపైనా మండల విద్యాధికారులు, ప్రాంతీయ తనిఖీ అధికారులు ఒత్తిడి చేసి ఫీజులు కట్టించారు. విద్యార్థులు ఎక్కడున్నారో తెలియదని చెప్పినా... కట్టాల్సిందేనంటూ ఆదేశించారు.'-లక్ష్మణరావు, ఎమ్మెల్సీ

వైసీపీ పాలనలో 62,740 మంది విద్యార్ధుల మృతి.. ఏంటీ దారుణం జగన్: నాదెండ్ల మనోహర్

'పాఠశాలలు, కళాశాలలకు రాని విద్యార్థులకు విద్యాకానుక, అమ్మఒడి ఇవ్వకపోయినా ఇచ్చినట్లు చూపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.' -ప్రసన్న, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రామన్న, డీవైఎఫ్ఐ కార్యదర్శి

School College Dropouts in AP : సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు ఆమోదిత మండలి-2021లో విడుదల చేసిన నివేదిక ప్రకారం... కడప, అనంతపురం, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పదో తరగతి తర్వాత ఇంటర్‌కు వెళ్లే సమయంలో 30శాతం మందికిపైగా మధ్యలోనే మానేస్తున్నారు. ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. పది, ఇంటర్ పూర్తి చేసి పై తరగతులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు నీతిఆయోగ్‌ కొన్ని పాయింట్లు ఇస్తోంది. ఈ విషయంలో మన రాష్ట్రం వెనుకబడి ఉన్నందునే ప్రభుత్వం రీ-అడ్మిషన్‌ విధానం పేరుతో ఉత్తుత్తి ప్రవేశాలను తెరపైకి తెచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.