బాలికల కంటే బాలురే ఎక్కువగా చదువు ఆపేస్తున్నారు.. ఆ జాబితాలో ఏపీ స్థానం ఎక్కడ

author img

By

Published : Nov 4, 2022, 7:39 AM IST

మధ్యలోనే చదువుకు ఆపేస్తున్న జాబితాలో ఏపీ

దేశవ్యాప్తంగా మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్న వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందని.. కేంద్ర విద్యాశాఖ యూడైస్ ఫ్లస్-2021-22 నివేదికలో వెల్లడించింది. పాఠశాల స్థాయిలో చదువుకు స్వస్తి పలుకుతున్న విద్యార్థులు 16.3శాతం ఉండగా, అందులో బాలికల కంటే బాలురే అధికంగా ఉండటం గమనార్హం.

రాష్ట్రంలో పాఠశాల స్థాయిలోనే 16.3శాతం మంది విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పేస్తున్నారు. దేశవ్యాప్తంగా మధ్యలోనే బడిమానేస్తున్న వారి జాబితాలో రాష్ట్రం 9స్థానంలో ఉంది. ఒడిషాలో అత్యధికంగా 27.3శాతం ఉండగా.. ఆ తర్వాత 21.7శాతంతో మేఘాలయ నిలిచింది. చదువు స్వస్తి చెబుతున్న వారిలో బాలికల కంటే బాలురే అధికంగా ఉంటున్నారని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ యూడైస్‌ ఫ్లస్‌-2021-22 నివేదికను విడుదల చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య, ప్రవేశాలు, మౌలికసదుపాయాలు, బోధన విధానాలు, బడి మానేస్తున్న వారి వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో...61వేల9వందల48 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా...82లక్షల44వేల6వందల47మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో...3లక్షల20వేల7వందల24మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.