Criminal changed yoga instructor: నేరస్తుడిని గురువుగా మార్చేసిన యోగా

author img

By

Published : Nov 7, 2022, 12:18 PM IST

criminal changed yoga instructor

Criminal changed yoga instructor: సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో కానీ యోగా, ధ్యానంతో కరుడుగట్టిన నేరస్తుడ్ని కూడా మనిషిగా మార్చవచ్చని జైలు అధికారులు నిరూపించారు. నేరం చేయడం జైలుకు వెళ్లడమే ప్రవుత్తిగా పెట్టుకున్న వ్యక్తిని యోగా మార్చేసింది. పరివర్తన చెందిన ఆ కురుడుగట్టిన నేరస్తుడు... అనేక మందికి యోగా శిక్షణలూ ఇస్తున్నాడు. అతనే ప్రతాప్ సింగ్... అలియాస్ ప్రతాప్ రామ్.

యోగా గురువుగా మారిన నేరస్తుడు

Criminal changed yoga instructor: యోగా సాధన చేస్తున్నఈ వ్యక్తి... సాధారణ వ్యక్తి అనుకుంటే మీరు పొరపడినట్లే..! ఇతను ఒకప్పుడు కరడుగట్టిన నేరస్తుడు...ఇతని మీద హత్యలు, హత్యా యత్నాలు, దోపిడీలు, దొంగతనాలు ఇలా పలు కేసుల్లో నిందితుడిగా శిక్ష అనుభవిచాడు. 2014లో కృష్ణా జిల్లా గన్నవరం వద్ద జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రతాప్ రామ్‌... రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాడు. అదే సమయంలో ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రణవ సంకల్ప సమితి, వోఎన్​జీసీ ఆధ్వర్యంలో కేంద్ర కారాగారంలో యోగా నేర్పించారు. ఆ శిక్షణ ప్రతాప్‌ రామ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అతని ఆలోచన, దృక్పథంలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. కేవలం నేర్చుకోవడంతోనే సరిపెట్టు కోకుండా యోగాలో పట్టు సాధించి శిక్షకుడుగా మారాడు.

ప్రతాప్ రామ్ స్వస్థలం ఉత్తరాఖండ్ లోని ఫితోడ్ గడ్ జిల్లాలోని ఓ గ్రామం. ఇతని తండ్రి సైన్యంలో ఉన్నత పదవి, సోదరుడూ ఆర్మీలోనే సేవలు అందించారు. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఇతనికి పోలియో కారణంగా... సైన్యంలో చేరాలన్న కలలు నెరవేరలేదు. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో మారు తల్లి పెట్టే కష్టాలు భరించలేక చిన్నతనంలోనే దిల్లీ పారిపోయాడు.. అక్కడ ... అనేక నేరాలు చేసి గ్యాంగస్టర్ గా మారాడు. రాజమహేంద్రవరంలో ప్రముఖ యోగా గురువు పతాంజలి శ్రీనివాస్, సూపరింటెండెంట్ రాజారావు ఆధ్వర్యంలో కేంద్ర కారాగారంలో ఇచ్చిన ఇచ్చిన శిక్షణ ప్రతాప్ జీవితాన్ని మార్చి వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.