ETV Bharat / state

తిరుమల, తిరుపతి పోలీసుల ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌

author img

By

Published : Sep 26, 2020, 2:53 PM IST

తిరుమల, తిరుపతి పోలీసులకు సంబంధించిన పలు ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి. సీఐలు రామకృష్ణ, సాయిగిరిధర్‌... ఎస్‌.ఐలు తిమ్మయ్య, సుమతి ఫేస్‌బుక్‌ ఖాతాలను హ్యాక్ చేసిన దుండగలు...మెసెంజర్‌ల ద్వారా డబ్బులు జమ చేయమంటూ సందేశాలు పంపారు. మిత్రులు ఫోన్ చేసి ఆరా తీయడంతో ఖాతాలు హ్యాక్‌ అయినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు.

Tirumala, Tirupati police Facebook accounts hacked
తిరుమల, తిరుపతి పోలీసుల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్‌

ఇప్పటి వరకు ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాక్ చేస్తూ వచ్చిన సైబర్ నేరగాళ్లు... ఇప్పుడు పోలీసులకే సరికొత్త సవాల్ విసురుతున్నారు. ఏకంగా పోలీసు సిబ్బంది సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాక్ చేసి... డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇది పోలీసులకు సరికొత్త తలనొప్పిగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో వరుసుగా పోలీసు అధికారుల ఫేస్​బుక్​ ఖాతాలు హ్యాక్ గురి కావడం కలవరపెడుతోంది. తాజాగా తిరుమల, తిరుపతికి చెందిన పలువురు పోలీసు అధికారుల ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి. సీఐలు రామకృష్ణ, సాయిగిరిధర్‌.. ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఫేస్‌బుక్‌ ఖాతాలు హస్తగతం చేసుకున్న హ్యాకర్లు... డబ్బులు డిమాండ్ చేశారు. ఫేస్​బుక్​ మెసేంజర్​ ద్వారా... ఆయా ఖాతాల్లో ఉన్న మిత్రులకు సందేశాలు పంపించి డబ్బులు కావాలని అభ్యర్థనలు పంపించారు. కొందరు తెలిసిన వ్యక్తులు సదరు వ్యక్తులకు ఫోన్ చేసి... డబ్బులు అవసరమేంటని... ఎలా పంపించాలని అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఒకే రోజు వివిధ వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చాక... పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. విచారణ చేస్తే తమ ఫేస్​బుక్​ ఖాతాలు హ్యాక్​ అయినట్టు నిర్దరణకు వచ్చారు. తమ పేర్లతో వచ్చే సందేశాలను నమ్మొద్దని... డబ్బులు వేయొద్దని తమ ఖాతాల్లో పోస్టు చేశారుర. దీనిపై తిరుపతి సైబ్ర్ క్రైం పోలీసులు ఫిర్యాదు అందుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.