ETV Bharat / state

Tension at Kuppam: పార్థసారథి అంత్యక్రియలకు భారీగా నేతలు.. కుప్పంలో ఉద్రిక్తత

author img

By

Published : Apr 8, 2022, 10:52 AM IST

Tension at kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్‌ పార్థసారథి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. ఆయన మృతికి ముందు తీసుకున్న సెల్పీ వీడియోలో.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్థసారథి అంత్యక్రియలకు వాల్మీకి సంఘాల నేతలు భారీగా తరలివస్తుండటంతో.. కుప్పంలో పోలీసులు భారీగా మోహరించారు.

Tension at kuppam with ysrcp activist death
వివాదస్పదమైన వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య

Tension at kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో.. గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్‌ పార్థసారథి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. గురువారం నాడు పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటంతో.. కుప్పంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మృతుని సెల్ఫీ వీడియోతో సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ఛైర్మన్‌ పదవికి వైకాపా నాయకులు తన వద్ద రూ.15 లక్షలు తీసుకున్నారని పార్థసారథి వెల్లడించారు. ఆయన అంత్యక్రియలకు వాల్మీకి సంఘాల నేతలు భారీగా తరలివస్తుండటంతో.. పోలీసులు భారీగా మోహరించారు.

Suicide: ఛైర్మన్‌ పదవి కోసం నేతలకు ఇచ్చిన సొమ్ముతో పాటు ఆలయ అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చడం ఇబ్బందిగా మారడంతో పాటు.. అవమానకరంగా ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించడంతోనే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందంటూ..పార్థసారథి తీసుకొన్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌, ఆయన సోదరుడు ఒత్తిడి వల్లనే తన అన్న చనిపోయాడని..మృతుని సోదరుడు ఆరోపిస్తున్నారు.

పార్థసారథి మృతిపై అనుమానాలు.. గంగమాంబ మాజీ ఛైర్మన్‌ పార్థసారథి మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించమని ప్రకటించారు. పార్థసారథి మృతదేహాన్ని వైకాపాకు దానం చేస్తున్నామని.. మృతదేహాన్ని తీసుకొనే ప్రసక్తే లేదని బంధువులు తెలిపారు.

వివాదస్పదమైన వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య

ఇదీ చదవండి:

Suicide: చిత్తూరు జిల్లాలో విషాదం.. వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.