ETV Bharat / state

Chandrabau Comments on Minister Peddireddy Corruption: పెద్దిరెడ్డి అవినీతిని చూపిస్తుంటే.. నాపై దాడులు చేస్తారా:చంద్రబాబు

author img

By

Published : Aug 5, 2023, 1:53 PM IST

TDP Chief Chandrababu Comments on Minister Peddireddy Corruption: ప్రాజెక్టుల పేరుతో మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని జీవోలతో సహా చూపిస్తుంటే తనపై దాడికి పాల్పడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నిస్తే తన రక్తం కళ్ల చూడాలనుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP-Chief-Chandrababu-Comments
TDP-Chief-Chandrababu-Comments

TDP Chief Chandrababu Comments on Minister Peddireddy Corruption: రాయలసీమలో తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు పారిస్తే.. అధికార వైఎస్సార్సీపీ రక్తం పారిస్తోందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ క్రీడలో భాగస్వాములై.. పోలీసు వ్యవస్థకు మచ్చ తేవద్దని ఆయన హితవు పలికారు. జగన్​ మోహన్​ రెడ్డి 12వేల కోట్ల రూపాయలతో కొత్తగా 10 ప్రాజెక్టులు అంటూ డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. గాలేరు నగరి సుజల స్రవంతి(GNSS) ప్రాజెక్టులో నీళ్లంటూ 3వేల 556 కోట్ల అవినీతికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరలేపారని ఆరోపించారు.

Chandrababu Fires on Minister Peddireddy: ఈ రోడ్డు మీ తాత జాగీరా.. పుంగనూరుకు మళ్లీ వస్తా: చంద్రబాబు

Chandrababu Power Point Presentation on Chittoor District Projects: గండిపేట-చిత్రావతి, గండికోట-పైడిపాలెం ప్రాజెక్టులు అటకెక్కాయని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట 5వ రోజు పర్యటనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జలాశయాల స్థితిగతులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూ.. పెద్దిరెడ్డికి మాత్రం 600 కోట్ల బిల్స్​ని క్లియర్ చేశాడని విమర్శించారు. పులివెందుల చక్రాయపేట నుంచి కదిరి మీదుగా తంబళ్లపల్లికి.. నీటి తరలింపు పేరున మంత్రి పెద్దిరెడ్డికి 5వేల 36 కోట్లతో పనులు మంజూరు చేశాడని ఆరోపించారు.

Tension at Punganur in Chandrababu Tour: రావణకాష్టంలా పుంగనూరు.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

Chandrababu on Handineeva Canal: 10 శాతం పెండింగ్ ఉన్న హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయకుండా కొత్త కాలువలు తవ్వుతా అని ప్రకటించాడని విమర్శించారు. అవులపల్లి రిజర్వాయర్​లోనూ పెద్దిరెడ్డి అక్రమాలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డికి 3 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం తన సంస్థ PLN కన్​స్ట్రక్షన్ ద్వారా ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టులను మొదలుపెట్టారని విమర్శించారు. రిజర్వాయర్ల నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతులు, పరిహారం LA పట్టించుకోకుండా టెండర్స్ నిర్వహించి పెద్దిరెడ్డి సంస్థకు పనులు అప్పగించారన్నారు.

పరిహారం కోసం ఆందోళన నిర్వహించిన రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని దుయ్యబట్టారు. దీనిపై రైతులు NGTకి అప్పీల్ చేయడంతో స్టేట్ ఎన్విరాన్​మెంట్ ఇంపాక్ట్ అసోసియేషన్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్ రద్దు చేసి.. రాష్ట్ర జలవనరుల శాఖకు 100 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు. పెద్దిరెడ్డి రిజర్వాయర్ల నిర్మాణ పనులు వెంటనే నిలిపివేసేలా ఆదేశాలిచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు.

Chandrababu Tour : వైసీపీకి మళ్లీ ఓటేస్తే.. ప్రజలకు గొడ్డలి పోటే : చంద్రబాబు

Chandrababu on Chittoor District Reservoirs: చిత్తూరు జిల్లాలో 4వేల 300 చెరువులు, వాటి కింద సుమారు 47వేల ఎకరాల సాగుభూమికి అవకాశం ఉంటే, వైసీపీ ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని అటకెక్కించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా 11వందల 47 ఎకరాల్లో చెరువుల ఆక్రమణ జరిగిందని ఆయన ఆరోపించారు. 75 ఎకరాల చెరువు విస్తీర్ణం పూడ్చి మరీ కబ్జా చేశారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశాడని అన్నారు.

గాలేరు నగరి సుజల స్రవంతిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. 146.26 కోట్లతో టీడీపీ ప్రభుత్వం ఫేస్ -1లో 84శాతం, ఫేస్ 2 లో 26 శాతం పనులు పూర్తి చేసిందన్న చంద్రబాబు.. జూన్ 2020 కల్లా పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. శ్రీ బాలాజీ రిజర్వాయర్, వేణుగోపాలసాగర్ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్లలో గత నాలుగేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని, ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని.. దుయ్యబట్టారు.

CBN Fire Minister Ambati Rambabu: 'నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే.. మంత్రి రాంబాబు 'బ్రో' సినిమా గురించి మాట్లాడుతున్నాడు'

సోమశిల స్వర్ణముఖి లింక్​ కెనాల్​కు 4 ఏళ్లలో కేవలం 18 కోట్లు ఖర్చు చేశారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. సోమశిల - స్వర్ణముఖి లింక్ కెనాల్ లిఫ్ట్ ప్రధాన కాలువ పెంచడానికి జీవో ఇచ్చి రెండు సంవత్సరాలు టెండర్లు పిలవలేదని చంద్రబాబు విమర్శించారు.

TDP Chief Chandrababu on Godavari Water: గోదావరి నీటిని రాయలసీమకు తీసుకొచ్చి తన జీవితాశయం నెరవేర్చుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు ఆయకట్టు పెంచేందుకు ఎటువంటి చర్యలు లేవన్న ఆయన.. లైనింగ్ పనులు ఆగిపోయాయన్నారు. చిప్పిలి స్టోరేజ్ ట్యాంక్​కు సంబంధించి అక్రమ ఇసుక తవ్వకాలతో కెనాల్ దెబ్బతిందని అన్నారు. అడవిపల్లి రిజర్వాయర్, లిఫ్ట్​కు టీడీపీ 90 శాతం పనులు చేస్తే, మిగిలిన 10 శాతం పనులు కూడా వైసీపీ చేయలేదని విమర్శించారు. కుప్పం బ్రాంచ్ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన 80 శాతం టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే, వైసీపీ మిగిలిన పనులు చేపట్టకపోగా, చెరువుల ఆక్రమణకు పాల్పడిందని చంద్రబాబు దుయ్యబట్టారు.

Chandrababu fire on Jagan in Project Tour: రివర్స్ నిర్ణయాలతో.. జగన్​ సాగునీటి రంగాన్ని అటకెక్కించాడు​: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.