ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Dec 30, 2022, 5:04 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • చంద్రబాబు స్క్రిప్ట్​.. పవన్​ కల్యాణ్​ యాక్టింగ్​: సీఎం జగన్​
    ‍JAGAN FIRES ON CBN AND PAWAN : రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపించామని ముఖ్యమంత్రి జగన్​ అన్నారు. నర్సీపట్నంలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించే ఏలేరు-తాండవ జలాశ్రయాలు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సభలో చంద్రబాబు, పవన్​పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జగన్‌కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది: చంద్రబాబు
    Chandrababu Comments on Jagan : ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ బీసీలకు చేయూతనిచ్చిందని తెలిపారు. టీడీపీ బీసీ సంక్షేమం కోసం నిర్వహించిన కార్యక్రమాలను వైసీపీ తొలగించిందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైసీపీ ఎమ్మెల్యేపై డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు
    Varla Ramaiah Complained on YCP MLA: దళిత వ్యక్తి అయిన హర్షను వైసీపీ నాయకులు తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‍రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
    Condolence to PM Modi Mother: ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రముఖలు సంతాపం ప్రకటించారు. భరతమాతకు ముద్దుబిడ్డను అందించిన మాతృమూర్తి హీరాబెన్‌..అని ప్రధాని తల్లిని కొనియాడారు. మోదికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని వారు అభిలాషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆమెకు '18'.. అతడికి '20'.. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో..
    ప్రేమించిన అమ్మాయికి 18 ఏళ్లు నిండేంత వరకు ఎదురుచూసిన ఓ యువకుడు తనకు మాత్రం చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసు రాకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చేశారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తలకు ఆపరేషన్​తో పాముకు పునర్జన్మ
    కర్ణాటకలో గాయపడిన పాముకు ఓ డాక్టర్ వైద్యం చేశారు. విజయవంతంగా దానికి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. ధార్వాడ్​​లోని హాలియా రోడ్డులో గాయపడిన స్థితిలో ఉన్న ఓ పామును జంతు ప్రేమికుడు సోమశేఖర్​ గుర్తించాడు. వెంటనే దాన్ని పట్టుకొని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైద్యుడు అని​ల్​ పాటిల్​ వద్దకు వెళ్లాడు. పామును పరీక్షించిన డాక్టర్​ దాని తలపై కణితిలాంటిది ఉందని, దాని నుంచి రక్తం కారుతుందని గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేపాల్​ ప్రధానిగా ప్రచండ.. అమెరికా, భారత్​ను చైనా దెబ్బ తీసిందా?
    నేపాల్‌ రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని పదవిపై ఎన్‌సీ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌-మావోయిస్టు సెంటర్‌ (సీపీఎన్‌-ఎంసీ) ఛైర్మన్‌ పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) మధ్య పడిన పీటముడితో పరిస్థితులు మారిపోయాయి. సీపీఎన్‌-యూఎంఎల్‌ నేత కె.పి.శర్మ ఓలి మద్దతుతో ప్రచండ ప్రధాని పీఠమెక్కారు. ఓలి చైనా చేతిలో కీలుబొమ్మ. ఇది భారత్‌కు రుచించని పరిణామమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హెల్త్​ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిం చేయాలో తెలుసా?
    కొవిడ్‌ భయాందోళనల నేపథ్యంలో మరోసారి ఆరోగ్య బీమాపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) క్లెయింలు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని ఆరోగ్య బీమా సంస్థలకు సూచించింది. పాలసీదారులూ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే.. ఇబ్బందుల్లేకుండా నగదు రహిత చికిత్స చేయించుకునే వీలుంటుంది. ఒకవేళ బిల్లు మీరు సొంతంగా చెల్లించినా, సులభంగానే ఆ మొత్తాన్ని రాబట్టుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వేలు విరిగినా లెక్కచేయని ఆసీస్​ స్టార్​ ఆల్​రౌండర్​.. త్వరలో సర్జరీ.. IPLకు డౌటే!
    ఆసీస్​ ఆల్​రౌండర్​ కామెరూన్​ గ్రీన్​ తీవ్రంగా గాయపడ్డాడు. అయినా లెక్కచేయకుండా మ్యాచ్​ ఆడాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లగా చేతి వేలు విరిగిందని తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఇప్పుడు తల్లిగా నటించాలంటే మనసు ఒప్పుకోవట్లేదు.. అందుకే చాలా సినిమాలు వదులుకున్నా'
    తెలుగు వెండితెరపై సీనియర్​ నటి సుధ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు తల్లి పాత్రలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచారు. కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. అవి ఆమె మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.