ETV Bharat / state

ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి మేరుగు నాగార్జున

author img

By

Published : Jan 7, 2023, 12:16 PM IST

Lift Irrigation Project: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున బాపట్ల జిల్లాలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుని 8.75 కోట్లతో నిర్మించారు. దీని ద్వారా 1036 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వివరించారు.

Merugu Nagarjuna
మేరుగు నాగార్జున

Lift Irrigation Project: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెంలో ఎత్తిపోతల పథకాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 8.75 కోట్లతో ఈ పథకాన్ని నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం వల్ల 1036 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాల్ని మంజూరు చేస్తుందని తెలిపారు.

"8 కోట్ల 75 లక్షలతో నిర్మించిన ఈ పథకాన్ని.. ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని... ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలనీ... పేద ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు". - మేరుగు నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి

ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.