ETV Bharat / state

ఉరవకొండ పీఎస్​లో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు హల్‌చల్‌

author img

By

Published : Dec 13, 2022, 2:42 PM IST

YCP MLA Prakash Reddy: రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో ఉరవకొండ పోలీసు స్టేషన్​లో హల్ చల్ చేశారు. కూడేరు మండలం కదరకుంటలో రమేష్ అనే భూ యజమాని 2019లో స్థిరాస్తి ఏజంట్ డీవీ నాయుడు ద్వారా మాజీ బ్యాంకు ఉద్యోగి గౌరీశంకర్ కు 1.27 ఎకరాల భూమి విక్రయించారు. అప్పట్లో వీరు పూర్తిగా డబ్బు చెల్లించకుండానే భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై రమేష్ ఎన్నిసార్లు అడిగినా మిగిలిన సొమ్ము ఇవ్వకపోవటంతో, విధిలేక భూ యజమాని ఆత్మహత్య చేసుకున్నారు. 2020లో రమేష్ భార్య తన భర్త చావుకు కారణమైన డీవీ నాయుడు, గౌరీశంకర్ లపై కేసుపెట్టారు. అప్పట్లో పోలీసులు దర్యాప్తు పూర్తిచేయకుండానే కేసును మూసేశారు.

Brother of Topudurthi Prakash Reddy
తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు

YCP MLA Prakash Reddy: అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసుస్టేషన్‌లో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి కలిసి హల్‌చల్‌ చేశారు. ఓ కేసులో తన అనుచరుడు గౌరీశంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆయన్ను కేసు నుంచి తప్పించేందుకు పోలీసులతో మంతనాలు చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వాహనాల్లో ఉరవకొండ పోలీసుస్టేషన్‌కు చేరుకోగా.. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఫొటోలు తీసేందుకు యత్నించగా అనుచరులు సెల్‌ఫోన్లు లాక్కుని వీడియోలు, ఫొటోలు తీసివేశారు. రమేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య కేసులో గౌరీశంకర్‌తోపాటు డీవీనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గౌరీశంకర్‌ పేరు తొలగించేలా చంద్రశేఖర్‌రెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

ఉరవకొండ స్టేషన్‌లో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు హల్‌చల్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.