ETV Bharat / state

"భూమి కనిపించిందా.. రాళ్లు పాతడమే".. ఇదీ వైసీపీ నాయకుల తీరు

author img

By

Published : Jan 17, 2023, 1:38 PM IST

YCP LEADERS OCCUPYING ANGANWADI LAND : రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూదాహాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పార్టీలో పెద్ద తలకాయ నుంచి చిన్నోళ్ల వరకూ.. ఎక్కడ భూమి కనిపించినా అక్కడ బండ పాతుడే అన్నట్లు తయారయ్యారు. పేదల స్థలాల నుంచి ప్రభుత్వ స్థలాల వరకూ స్వాహా చేస్తూనే ఉన్నారు. తాజాగా వారి కన్ను గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రం కోసం అని మంజూరు చేసిన స్థలంపై పడింది.

YCP LEADERS OCCUPYING ANGANWADI LAND
YCP LEADERS OCCUPYING ANGANWADI LAND

ANGANWADI LAND KABJA : వైసీపీ నాయకుల భూ దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పేదల భూములను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ పనులకు కేటాయించిన స్థలాల్లోనూ దౌర్జన్యంగా బండలు పాతుతున్నారు. తాజాగా వారి భూదాహానికి అనంతపురం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడి భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని స్వాహా చేశారు.

అనంతపురం గ్రామీణం చిన్నంప్లిల పంచాయతీలోని సంతోష్‌నగర్‌లో.. అంగన్‌వాడీ భవనానికి కేటాయించిన స్థలాన్ని.. అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ భవనానికి కేటాయించిన స్థలాన్ని.. స్థానిక వైసీపీ నాయకులు చదును చేయించి, బండలు పాతి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రశ్నించినవారిపై బెదిరింపులకు దిగుతున్నారు. చిన్నంపల్లి పంచాయతీకి సంతోష్‌నగర్‌ దూరం కావడంతో.. అక్కడ అంగన్‌వాడీ భవనం ఉండాలని నిర్ణయించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. 4.33 సెంట్ల స్థలాన్ని ఐసీడీఎస్​ అధికారులకు అప్పగించారు.

2020 అక్టోబర్‌ 18న రెండోసారి పంచాయతీ తీర్మానం చేశారు. అక్కడ సెంటు స్థలం సుమారు 3 లక్షల నుంచి 4 లక్షలు పలుకుతోంది. సంతోష్‌నగర్‌కు డీ-ఫాం పట్టాలు ఎక్కువగా ఉండటంతో.. ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు.. అధికార పార్టీ నాయకులు బండలు పాతిపెడుతున్నారు. తాజాగా అంగన్‌వాడీ స్థలాన్ని ఆక్రమించుకున్న వైసీపీ నాయకులు.. ఇది ఓ మహిళకు సంబంధించిన స్థలమంటూ ఆమెకు అప్పగించారు. వైసీపీ నాయకుల అండతో ఆమె బెదిరింపులకు పాల్పడుతున్నారని.. గ్రామస్థులు తెలిపారు. స్థలాలు అమ్ముకుని వైసీపీ నాయకులు సొమ్ములు పంచుకుంటున్నారని.. స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.