ETV Bharat / state

టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు గృహ నిర్బంధం.. రాయదుర్గంలో ఉద్రిక్తత

author img

By

Published : Jan 9, 2023, 3:46 PM IST

Updated : Jan 9, 2023, 9:32 PM IST

KALVA SRINIVASULU HOUSE ARREST
KALVA SRINIVASULU HOUSE ARREST

KALVA SRINIVASULU HOUSE ARREST: ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు చేపట్టదలచిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాదయాత్రకు వెళ్లకుండా ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బొమ్మనహల్ మండలంలో తెలుగుదేశం చేపట్టిన పాదయాత్రకు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా ఆపార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

TDP LEADER KALVA SRINIVASULU HOUSE ARREST : అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు గృహ నిర్బంధం చేసి.. అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ... బొమ్మనహాళ్ మండలంలో కాలవ పాదయాత్ర తలపెట్టారు. యాత్రలో కాలవ శ్రీనివాసులు పాల్గొనకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. డీఎస్పీ, ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలతో పాటు సుమారు 150 మంది పోలీసులు నివాసం చుట్టూ పహారా కాశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఇంటి వద్దనే నోటీసులు ఇచ్చారు. టీడీపీకి చెందిన మండల స్థాయి ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు గృహ నిర్బంధం.. రాయదుర్గంలో ఉద్రిక్తత

"ఐదు కిలోమీటర్ల దూరం నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నట్లు మూడు రోజుల ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ట్రాఫిక్​ లేని మారుమూల రహదారిని ఎంచుకుని మా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. కానీ నిన్న సాయంత్రం నుంచి వందల మంది పోలీసులు రాయదుర్గం నియోజకవర్గంలో మోహరించి ప్రజలను బెదిరిస్తూ.. పౌరుల కదలికలపై నిఘా నిర్వహిస్తున్నారు. ఇదేనా మీ పోలీసుల డ్యూటీ?"-కాలవ శ్రీనివాసులు, టీడీపీ మాజీ మంత్రి

విషయం తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు కాల్వ నివాసానికి చేరుకున్నారు. పోలీసులు నిర్బంధించిన నేపథ్యంలో కాలవ శ్రీనివాసులు తన ఇంటి వెనుక నుంచి రోడ్డు పైకి వచ్చారు. దీంతో పోలీసులు-టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేతల ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోనేందుకు వెళ్లనీయకుండా తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని కాలవ మండిపడ్డారు. ఓ వైపు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం.. మరోవైపు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Jan 9, 2023, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.