ETV Bharat / state

TDP Bus Yatra: ప్రజలపై వైసీపీ దౌర్జన్యం.. బస్సు యాత్రలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

author img

By

Published : Jul 2, 2023, 6:23 PM IST

Updated : Jul 2, 2023, 7:25 PM IST

TDP Leaders Bus Yatra: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ యాత్రలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎక్కడికక్కడ ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.

TDP Leaders Bus Yatra
రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోంది.. బస్సు యాత్రలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

TDP Leaders Bus Yatra: పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ రాయితీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా సింగణమల నియోజకవర్గం గర్లదిన్నె మండలంలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇల్లూరు గ్రామంలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ద్విసభ్య కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు.

గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి లక్ష్యంగా తమ నేత చంద్రబాబు కృషి చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని పరిటాల సునీత అన్నారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమని మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని ఆమె చెప్పారు.

చిత్తూరు.. జిల్లాలోని నగరిలో భవిష్యత్తుకు గ్యారెంటీ రథయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహించారు. అనంతరం బస్సు యాత్ర నగిరి పట్టణ వీధుల్లో కొనసాగింది. టీడీపీ నేతలు స్థానిక టవర్ క్లాక్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగరి టీడీపీ బాధ్యుడు గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోందని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడు సందర్భంగా మినీ మేనిఫెస్టోను విడుదల చేశారని ఆయన వివరించారు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూపాయల 1500 చొప్పున అందించనన్నట్లు తెలిపారు. అమ్మకు వందనం కార్యక్రమంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే వారికి పద్ధతి వేల చొప్పున అందించనున్నట్లు తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు వంటి ఏర్పాటు చేస్తారని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని తెలిపారు.

రోజా వల్ల ప్రజలకు ఏమి జరిగింది.. మంత్రి ఆర్కే రోజా అవినీతికి పాల్పడుతున్నారని హైదరాబాదు బెంగళూరు చెన్నై​లో పెద్ద ప్యాలెస్సులు కట్టుకున్నారని ప్రజలకు ఆమె వల్ల ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టడం లేదని తన తండ్రి గాలి ముద్దుకృష్ణుడు చేసిన అభివృద్ధి పనులకే శిలాఫలకాలు ప్రారంభోత్సవాలు చేస్తూ నాలుగేళ్లు గడిచిందని తెలిపారు నగరిలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని చెప్పారు ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఎం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా.. తెలుగుదేశంపై ఉన్న రాజకీయ కక్షను వైసీపీ ప్రభుత్వం పేదప్రజలపై తీర్చుకుంటుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుయాత్రలో ఆయన పాల్గొన్నారు. శిల్పారామం, అడవి తక్కెళ్లపాడులోని టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ నేతలు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ హయంతో శిల్పారామం అభివృద్ధి పనులు పూర్తైన వైసీపీ ప్రభుత్వం ప్రారంభించలేదని మండిపడ్డారు..

Last Updated : Jul 2, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.