ETV Bharat / state

ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు.. రూ.2లకే భోజనం అందిస్తున్న అభిమానులు

author img

By

Published : Jun 24, 2022, 6:09 PM IST

Nandamuri Fans: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుని విదేశాల్లోని ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో పేదలకు చేదోడుగా నిలుస్తున్నారు. నిరుపేదల ఆకలి తిర్చటానికి..2 రూపాయలకే అన్నదానానికి శ్రీకారం చుట్టారు.

రూ.2లకే భోజనం
రూ.2లకే భోజనం

అక్కడ రూ.2లకే భోజనం ...చేపట్టిన ఎన్‌ఆర్‌ఐ నందమూరి అభిమానులు

Meals for Rs.2: తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్‌ పేరుతో అన్నక్యాంటీన్‌ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కేవలం 5 రూపాయలకే భోజనం, అల్పాహారం అందించింది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను మూసేసింది. అయితే పేదల ఆకలిని తీర్చేందుకు విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు.. ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది పాటుగా కేవలం రెండు రూపాయలకే అన్నదాన వితరణను చేపట్టారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. పలుచోట్ల ఈ భోజన సేవను ప్రారంభించారు. నెల రోజుల క్రితం ఈ భోజన వితరణ సేవ ప్రారంభం కాగా.. హిందూపురం అధికార పార్టీ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. నందమూరి అభిమానులు వెనక్కు తగ్గకుండా అన్నం, పప్పు, రసం, కూర, మజ్జిగతో పాటు రోజుకూ ఒక స్పెషల్‌ వంటకంతో..రుచికరంగా పేదలకు భోజనం అందిస్తున్నారు.

ఈ క్యాంటీన్‌ ద్వారా దాదాపుగా 400నుంచి 500 వందల మంది ఆకలి తీరుస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. నందమూరి కుటుంబాన్ని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న హిందూపురంలో ఏడాదిపాటు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు చెబుతున్నారు. ఏడాది పాటు సాగే భోజన వితరణ సేవను విదేశాల్లోని బాలయ్య అభిమానులు వీడియోల ద్వారా పర్యవేక్షిస్తూ ఆర్థిక సహాయం చేస్తున్నారు.


ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.