ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీకొట్టిన లారీ.. ​ డ్రైవర్​ మృతి..

author img

By

Published : Oct 28, 2022, 12:58 PM IST

Accident: ఇటుకల లోడ్​తో వెళ్తున్న ట్రాక్టర్​ను వెనక వైపు నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానిగి వెంటనే ట్రాక్టర్​ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్​ అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే.. ​

Etv Bharat
Etv Bharat

Road Accident In Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం మరెంపల్లి వద్ద జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం మొలకాల్మురుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గురుమూర్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరొక వ్యక్తి మహేష్ తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం వైపు నుంచి కళ్యాణదుర్గం పట్టణానికి ఇటుకల లోడ్​తో వెళుతున్న ట్రాక్టర్​ను వీఆర్ఎల్ పార్సల్ సర్వీస్ లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ప్రమాద ధాటికి ట్రాక్టర్, లారీ రెండు ధ్వంసమయ్యాయి. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రాయదుర్గం రూరల్ సీఐ, గుమ్మగట్ట ఎస్సై ఏ సునీత ప్రమాద స్థలాన్ని సందర్శించి జాతీయ రహదారిలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మృతుడు గురుమూర్తి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.