ETV Bharat / state

వాటిని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

author img

By

Published : Feb 3, 2022, 9:45 PM IST

వాటిని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తాం
వాటిని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తాం

అనంతపురం జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం, ఏకశిలా రాతి నంది విగ్రహాలను యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభకు వివరించారు. వారసత్వ కేంద్రాలకు విశ్వవ్యాప్తంగా ఉన్న విలువను దృష్టిలో ఉంచుకుని వాటిని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.

అనంతపురం జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం, ఏకశిలా రాతి నంది విగ్రహాలను యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభకు వివరించారు. భాజపా సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వారసత్వ కేంద్రాలకు విశ్వవ్యాప్తంగా ఉన్న విలువను దృష్టిలో ఉంచుకుని యునెస్కో నిర్వహణ మార్గదర్శకాలను అనుసరించి వాటిని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయనున్నట్లు మంత్రి తన సమాధానంలో వివరించారు.

కేంద్ర ప్రభుత్వానికి అందిన అన్ని ప్రతిపాదనలను..ఆయా ప్రదేశాలకు ఉన్న ప్రపంచ వ్యాప్త విలువ, కొలమానం, సమగ్రత, ఇతర స్థలాలతో పోల్చితే వాటికి ఉన్న ప్రాధాన్యం ఆధారంగా మదింపు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు భారత్‌ నుంచి 46 ప్రతిపాదనలను ఈ తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు తెలిపారు. వీటిలో.. తెలంగాణ నుంచి గోల్కొండ కోట, చార్మినార్‌లను ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ చీర నేత క్లష్టర్లను చేర్చినట్లు మంత్రి సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి

CS ON PRC: సమ్మెకు వెళ్తే అనేక ఇబ్బందులు వస్తాయి.. చర్చలకు రండి: సీఎస్​ సమీర్​శర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.