ETV Bharat / state

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2.90 లక్షల కోట్లు.. ఏయే రంగాలకు ఎంత కేటాయించారంటే..?

author img

By

Published : Feb 6, 2023, 5:43 PM IST

Updated : Feb 6, 2023, 10:55 PM IST

Telangana 2023-24 budget updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ మొత్తం బడ్జెట్‌ 2,90,396 కోట్లు అని హరీశ్‌రావు చెప్పారు. అందులో ఏయే రంగాలకు ఎంతెంత కేటాయించారనే పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు.

TG Budget
TG Budget

Telangana 2023-24 budget updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యవయం రూ.2,11,685 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 37, 525 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

'తెలంగాణ ప్రారంభిస్తోంది.. దేశం ఆచరిస్తోంది. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడింది. సంక్షోభ సమయాల్లో సమర్థంగా ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోంది. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తోంది. రాష్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టింది.' అని ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అన్నారు.

కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. నీతి ఆయోగ్‌ సిఫారసులను కేంద్రం పట్టించుకోవట్లేదన్న హరీశ్ రావు.. విభజన సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బంది పెడుతోందని వాపోయారు. ట్రైబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల పేరిట ఆలస్యం చేస్తోందని తెలిపారు. ఏపీ నుంచి విద్యుత్‌ బకాయిలు ఇప్పించాలని కోరినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్రం గణనీయంగా ప్రగతి సాధిస్తోందని వెల్లడించారు.

బడ్జెట్‌ సమగ్ర స్వరూపం..

  • రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు
  • సొంత పన్నుల ఆదాయం రూ.1,31,028 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు
  • 2023 - 24 లో రుణాలు రూ.46,317కోట్లు
  • పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు
  • గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు..

  • రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
  • వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు
  • నీటి పారుదల రూ. 26,885 కోట్లు
  • విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు
  • ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు
  • ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు
  • దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు
  • ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
  • అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు
  • విద్య కోసం రూ.19, 093 కోట్లు
  • వైద్యం కోసం రూ.12,161 కోట్లు

ఇవీ చదవండి

Last Updated : Feb 6, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.