ETV Bharat / state

ఇదెక్కడి న్యాయం: మా భూములు తీసుకుని, పంచారు.. పరిహారం అడిగితే పట్టించుకోవటం లేదు

author img

By

Published : Feb 6, 2023, 3:46 PM IST

Land pooling Compensation
ల్యాండ్​ పూలింగ్​ పరిహారం

Agitation : ల్యాండ్​ పూలింగ్​ ద్వారా మీ భూములు ఇవ్వండి. ఆ భూముల్లో జగనన్న కాలనీలు నిర్మిస్తాం.. మీకు నష్టపరిహారంగా డబ్బులు ఇస్తాం.. ఇలా అధికార్లు చెప్పిన మాటలు నమ్మి, ఆ పేద రైతులు తమకున్న భూములను ప్రభుత్వానికి అప్పంగించారు. ఇంకేముంది.. పెను వేగంతో ఆ భూమిని పట్టాలుగా మార్చి.. దరఖాస్తు చేసుకున్న పేదలందరికి పంచారు నేతలు. పట్టాలు తీసుకున్న లబ్దిదారులు ఇల్లు కట్టుకునేందుకు సిద్దమయ్యారు. మాకు పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా చేస్తారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళ నిర్మాణాన్ని అడ్డుకుంటే, కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి భూములిచ్చిన పాపానికి తమకేంటీ ఈ శిక్ష అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Agitation : నిబంధన ప్రకారం ల్యాండ్​ పూలింగ్​ పరిహారం రైతులకు అందించకుండా.. జగనన్న నిర్మాణాలు ఎలా చేపడుతారని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండాలానికి చెందిన గంధవరం రైతులు పరిహారం అందించాలని ఆందోళనకు దిగారు. 2019లో పలు సర్వే నంబర్లలోని 19 ఎకరాల డీ పట్టా భూమిని.. జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించింది.

భూ సేకరణ సమయంలో భయభ్రాంతులకు గురిచేసి మరి భూములు తీసుకున్నారని రైతులు వాపోయారు. నిబంధనల ప్రకారం ల్యాండ్​ పూలింగ్​ పరిహారంతో పాటు, పంట నష్టం చెల్లించకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న జీడి మామిడి తోటలను పంట చేతికచ్చే సమయంలో నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే లక్షలు విలువ చేసే టేకు చెట్లను కోల్పోయామన్నారు.

స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు ఇచ్చిన ప్రయోజనం లేదన్నారు. పరిహారం కోసం కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగామని.. ఎవరు పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిహారం అందించాలని కోరారు. జీవానాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందారు. పరిహారం అందించకపోతే జగనన్న నిర్మాణాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

"దౌర్జన్యంగా మా భూములు మా దగ్గరి నుంచి లాక్కున్నారు. పరిహారం ఇవ్వమని అడిగితే పట్టించుకోవటం లేదు. పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టారు. వాటిని ఆపడానికి వెళ్తే మాపై కేసులు పెడుతున్నారు. మేము వెళ్లని కార్యాలయం లేదు, కలవని అధికారి లేడు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మా భూమి కోల్పోయి రోడ్డున పడ్డాము." - మహిళ రైతు

"మా దగ్గరి నుంచి మా భూములు తీసుకున్నారు. మామిడి తోటలు, టేకు తోటలు తీసుకున్నారు. పరిహారం ఇస్తామని ఇవ్వలేదు. పొలానికి బదులుగా స్థలాలు ఇస్తామన్నారు. అందుకు అంగీకారించి మా భూముల్ని ఇచ్చాము. ఇస్తామని చెప్పిన పరిహారం భూమికి బదులు భూమి ఏది ఇవ్వలేదు. ఇన్నీ సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఏది ఇవ్వలేదు. పైగా ఇందులో నిర్మాణాలు చేపట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు." -రైతు

ల్యాండ్ పూలింగ్ పరిహారం అందిచలేదంటూ రైతుల ఆందోళన

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.