మావోయిస్టుల ఎటాక్.. పోలీసుల అలర్ట్..

మావోయిస్టుల ఎటాక్.. పోలీసుల అలర్ట్..
POLICE ALLERT: సీఆర్ఫీఎఫ్ పోలీసులపై మావోయిస్టుల దాడితో ఒడిశాలోని నువాపాడా జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పటాధర అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో ముగ్గురు సీఆర్ఫీఎఫ్ పోలీసులు మరణించగా.. ఏడుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
POLICE ALLERT: సీఆర్ఫీఎఫ్ పోలీసులపై మావోయిస్టుల దాడితో ఒడిశాలోని నువాపాడా జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో ఏఓబీలో సాయుధ బలగాల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటాధర అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో ముగ్గురు సీఆర్ఫీఎఫ్ పోలీసులు మరణించగా.. ఏడుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక క్యాంపు నుంచి వేరే క్యాంపుకు వెళ్తున్న సీఆర్ఫీఎఫ్ 19 బెటాలియన్‌కు చెందిన భద్రత బలగాలపై.. మావోయిస్టులు కాల్పులు జరిపారు. సీలేరు, ఐటీఐ కూడలి వద్ద తనిఖీలు నిర్వహించి అనుమానితులుగా కనిపిస్తున్న వారిని ప్రశ్నించి విడిచిపెడుతున్నారు. అదను చూసి జవాన్లపై దాడి చేయడంతో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఇవీ చదవండి:
