ETV Bharat / state

లంబసింగి అందాలు ఆకట్టుకున్నాయి : జస్టిస్‌ దేవానంద్‌

author img

By

Published : Dec 20, 2022, 11:31 AM IST

The beauty Of Lambasinghi Is Impressive:అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్ర‌ముఖ ప‌ర్య‌ట‌క కేంద్రం ఆంధ్రా క‌శ్మీర్ లంబసింగి, తాజంగి అందాలు ఎంతో ఆకట్టుకున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్ అన్నారు. కుటుంబసమేతంగా పర్యటించిన ఆయన అల్లూరి జిల్లాలో ఈ ప్రాంత అందాలను తిలకించారు.

Etv Bharat
Etv Bharat

The beauty Of Lambasinghi Is Impressive: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్ర‌ముఖ ప‌ర్య‌ట‌క కేంద్రం ఆంధ్రా క‌శ్మీర్ లంబసింగి, తాజంగి అందాలు ఎంతో ఆకట్టుకున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్ అన్నారు. కుటుంబసమేతంగా పర్యటించిన ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రాంత అందాలను తిలకించారు. ముందుగా లంబసింగిలో గిరిజ‌నులు సాగు చేస్తున్న స్ట్రాబెర్రీ తోటలను ప‌రిశీలించారు. తాజంగి జలాశయం వద్ద కుటుంబ‌ సభ్యుల‌తో బోటు షికారు చేశారు. ఈ సంద‌ర్బంగా హైకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్‌ దేవానంద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పర్యాటకులు ఆస్వాదించే అందాలు చాలా ఉన్నాయని, పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

లంబసింగి అందాలు ఆకట్టుకున్నాయి : జస్టిస్‌ దేవానంద్‌

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.