ETV Bharat / state

టెన్త్​ పరీక్ష రాస్తూ కళ్లు తిరిగిపడిపోయిన విద్యార్థి.. విషయం తెలిసి అంతా షాక్​..

author img

By

Published : May 7, 2022, 11:35 AM IST

Covid positive: టెన్త్​ పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి కళ్లు తిరిగి పడిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అంతా షాక్​కు గురయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Covid positive
పదో తరగతి విద్యార్థికి కరోనా పాజిటీవ్​

Covid positive: తగ్గినట్లే కనిపిస్తున్నా కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు 'ఇంకా ఉన్నాను' అని గుర్తుచేస్తోంది. తాజాగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్​గా తేలడం అందరిని భయాందోళనకు గురిచేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి పదో తరగతి సోషల్ పరీక్ష రాస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆరోగ్య సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా కొవిడ్ పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. పరీక్ష పూర్తయిన తర్వాత మిగిలిన 22 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేశారు. అందరికీ నెగిటివ్​గా తేలింది. విద్యార్థి మోహనాపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థిగా గుర్తించారు. మందులు ఇచ్చి హోంక్వారంటైన్​లో ఉండాలని వైద్యులు సూచించారు.

ఇదీ చదవండి:

EXAMS: పరీక్షకు దూరం చేస్తున్న నిమిషం నిబంధన.. ఇంటర్‌ విద్యార్థులకు అవస్థలు

ఆందోళనకరంగా పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

'దీపికా పిల్లి' ఇంత స్పీడా​.. అనసూయ కూడా ఆమె తర్వాతేగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.