ETV Bharat / state

బీజేపీని గద్దె దింపేందుకు కలిసి పని చేస్తాం.. బీఆర్‌ఎస్ సభలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్

author img

By

Published : Jan 18, 2023, 6:18 PM IST

Akhilesh Yadav
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav Fires on BJP: ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీని ప్రక్షాళన చేస్తున్నారని పేర్కొన్నారు. యూపీలోనూ బీజేపీని గద్దె దింపేందుకు కలిసి పనిచేస్తామని ఆయన వివరించారు.

Akhilesh Yadav Fires on BJP: బీజేపీపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు . ఖమ్మం సభ నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారని అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించిన నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని స్పష్టం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని అఖిలేష్ ప్రశ్నించారు. రైతులకు సరైన మద్దతు ధర లభించట్లేదని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని తెలిపారు. జి-20 అధ్యక్షత వహించడం భారత్‌కు మంచి అవకాశమని చెప్పారు. కానీ జి-20 అంశాన్ని కూడా ఎన్నికలకు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీని ప్రక్షాళన చేస్తున్నారని వివరించారు.

బీజేపీని గద్దె దింపేందుకు కలిసి పనిచేస్తాం: యూపీలోనూ బీజేపీని గద్దె దింపేందుకు కలిసి పనిచేస్తామని అఖిలేష్‌ యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని అయ్యే వ్యక్తులు.. యూపీ తప్పకుండా వస్తారని వెల్లడించారు. ప్రధాని కావడం కోసమే గుజరాత్‌ నుంచి.. ఉత్తరప్రదేశ్ వచ్చారని విమర్శించారు. గుజరాత్‌ నుంచి ప్రధాని కాగలిగితే.. ఆ రాష్ట్రాన్ని వీడి రారని పేర్కొన్నారు. గంగా ప్రక్షాళన చేస్తామని నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఇంటింటా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోందన్నారు. సమీకృత కలెక్టరేట్‌ ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని అఖిలేష్ యాదవ్ వివరించారు.

"ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రశ్నించిన నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. ప్రధాని కావడం కోసమే గుజరాత్‌ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చారు. - అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం

బీజేపీపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.