ETV Bharat / sitara

'హరిహర వీరమల్లు' షూటింగ్ అప్డేట్.. 'యశోద'లో మరో స్టార్

author img

By

Published : Dec 20, 2021, 5:52 PM IST

Updated : Dec 20, 2021, 7:08 PM IST

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో హరిహర వీరమల్లు, రాధేశ్యామ్, యశోద, అతిథి దేవోభవ, సుధీర్​బాబు, దుల్కర్​ సల్మాన్​కు సంబంధించిన కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి.

pawan kalyan samantha
పవన్ కల్యాణ్ సమంత

Pawan kalyan movie: పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ 'భీమ్లా నాయక్' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్​కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

.
.

స్క్రిప్ట్​ రీడింగ్​ సెషల్ అద్భుతంగా ఉందని, న్యూయర్ తర్వాత 'హరిహర వీరమల్లు' కొత్త షెడ్యూల్​ మొదలవుతుంది డైరెక్టర్ క్రిష్ ట్వీట్ చేశారు. పవన్​తో ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

Radhe shyam movie: 'రాధేశ్యామ్' నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. కీలకపాత్రలో నటిస్తున్న రెబల్​స్టార్ కృష్ణంరాజ్​ ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన పరమహంస అనే సాధువు పాత్రలో నటిస్తున్నారు. కాషాయ దుస్తుల్లో ఉన్న కృష్ణంరాజు.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు. ప్రభాస్​, పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి గతంలో బిల్లా, రెబల్​ సినిమాల్లో నటించారు.

radhe shyam krishnam raju
రాధేశ్యామ్​లో కృష్ణంరాజు

'రాధేశ్యామ్'.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

Samantha Yasodha movie: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'యశోద'. ఈ థ్రిల్లర్​ చిత్ర షూటింగ్​ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో తమిళనటి వరలక్ష్మి కీలకపాత్ర పోషిస్తుండగా.. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

.
.

శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి-హరీశ్ ద్వయం దర్శకులుగా పరిచయమవుతున్నారు. మార్చి కల్లా షూటింగ్ పూర్తిచేసి వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'యశోద'ను విడుదల చేయనున్నారు.

సుధీర్​బాబు కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నటుడు-రచయిత హర్షవర్ధన్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సునీల్ నారంగ్-పుష్కుర్ రామ్​మోహన్​ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.

.
.

ముద్దుగుమ్మ నజ్రియా నజిమ్​కు 'అంటే సుందరానికి!' టీమ్​ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఆమె కొత్త స్టిల్​ను విడుదల చేసింది. నేచురల్ స్టార్ నాని.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

.
.

కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'బ్రోచేవారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ఫస్ట్​లుక్​ను తెలుగులో నాగార్జున-అమల.. మంగళవారం ఉదయం రిలీజ్ చేయనున్నారు. అలానే ఆది 'అతిథి దేవోభవ' టీజర్​ కూడా మంగళవారం ఉదయమే విడుదల కానుంది.

nagarjuna amala
నాగార్జున-అమల
.
.

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2021, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.