సముద్రంలో మునిగిన భారీ నౌక- నలుగురు భారతీయులు సహా 13 మంది గల్లంతు

author img

By PTI

Published : Nov 26, 2023, 8:02 PM IST

Updated : Nov 26, 2023, 8:40 PM IST

cargo ship sinks greece

Cargo Ship Sinks Greece : గ్రీసు దేశ తీరంలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో ఒకరిని రక్షించగా.. 13 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు.

Cargo Ship Sinks Greece : గ్రీసు దేశ తీరంలో ఓ కార్గో నౌక మునిగిపోయి నలుగురు భారతీయులు సహా 13 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 సిబ్బంది ఉండగా.. ఒకరిని రక్షించినట్లు అధికారులు చెప్పారు. వీరిలో నలుగురు భారతీయులతో పాటు ఎనిమిది మంది ఈజిప్టునకు చెందినవారు.. ఇద్దరు సిరియాకు చెందిన వారున్నారు. బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఇదీ జరిగింది
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నుంచి రాప్టర్‌ అనే కార్గో నౌక.. 6,000 టన్నుల ఉప్పుతో తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో ఆదివారం ఉదయం 7గంటలకు నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. హుటాహుటిన సమీప కేంద్రానికి ప్రమాద సంకేతాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నౌక కనిపించకుండా పోయినట్లు స్థానిక కోస్ట్‌ గార్డ్‌ చెప్పింది.

వెంటనే రంగంలోకి దిగిన రెస్య్క్యూ బృందాలు.. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు హెలికాప్టర్లతో పాటు ఎనిమిది నౌకలు, గ్రీస్‌కు చెందిన ఓ యుద్ధ నౌకతో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందులో ఒక ఈజిప్టు దేశీయుడిని రక్షించినప్పటికీ.. 13 మంది ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించారు. సముద్రంలో భీకర గాలులతో ప్రతికూల వాతావరణం ఉండడంతో గాలింపు కష్టతరంగా మారిందని రెస్య్కూ సిబ్బంది వివరించారు.

పడవ మునిగి 17 మంది మృతి.. 70 మంది గల్లంతు.. మృతదేహాలు దొరికే ఛాన్స్ కూడా లేకుండా..
Nigeria Boat Accident : ఇటీవలె ఆఫ్రికా దేశం నైజీరియాలో పడవ మునిగిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తారాబా రాష్ట్రంలోని అర్డో-కోలా జిల్లాలో ఈ ఘటన జరిగింది. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 70 మంది గల్లంతయ్యారు. దేశంలోనే అతిపెద్ద నది అయిన బెన్యూలో ఈ పడవ ప్రయాణిస్తోంది. స్థానిక చేపల మార్కెట్ నుంచి వ్యాపారులతో తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే పడవ బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నదిలో పెళ్లి 'బోటు' బోల్తా.. 100 మంది మృతి.. అనేక మంది గల్లంతు

Congo Boat Accident : ఇంధనంతో వెళ్తున్న పడవలో మంటలు.. 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు

Last Updated :Nov 26, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.