ETV Bharat / crime

BABY MISSING: మార్కాపురం వైద్యశాలలో అదృశ్యమైన పసికందు ఆచూకీ లభ్యం

author img

By

Published : Aug 28, 2021, 2:00 PM IST

Updated : Aug 29, 2021, 8:24 AM IST

baby missing
baby missing

13:58 August 28

పసికందు ఆచూకీ లభ్యం

మార్కాపురం జిల్లా వైద్యశాలలో పసికందు అదృశ్యం

ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో నిన్న అపహరణకు గురైన ఐదు రోజుల శిశువు ఆచూకీ అభ్యమైంది. మార్కాపురం పట్టణంలోని ఓ ప్రేవేట్ వైద్యశాలలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శిశువు దగ్గరున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువును అర్థరాత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలమేరకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ప్రేవేట్ వైద్యశాలలో ఉన్న శిశువు గురించి ఆరా తీయగా అపహరించిన మహిళ పోలీసులకు దొరికిపోయింది. రోజు గడవముందే శిశువు ఆచూకీ గుర్తించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ మలికా గార్గ్ అభినందించారు.

ఇదీ జరిగింది..

గుంటూరు జిల్లా కారంపూడికి దగ్గర్లోని బట్టువారిపాల్లి గ్రామానికి చెందిన నెలలు నిండిన ఓ గర్భిణి.. కాన్పుకోసం మార్కాపురం మండలంలోని తల్లిగారి గ్రామం కోలాభీమునిపాడుకు వచ్చింది. నొప్పులు రావడంతో ఐదు రోజుల క్రితం కాన్పు కోసం మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోమలిని చేర్చారు. ఆమె అక్కడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పసికందుకు కామెర్ల వ్యాధి కనిపించడంతో వైద్యులు ఆ పసికందును ఫొటోగ్రఫీ వైద్యం కోసం ప్రత్యేక వార్డులోకి తీసుకెళ్లారు. బంధువులను తమ గదిలోకి వెళ్లి ఉండమన్నారు. ఎంత సేపటికి సిబ్బంది బయటకి రాకపోవడంతో తల్లి కోమలి వార్డులోకి వెళ్లి చూసింది. అక్కడ సిబ్బందితో పాటు, పాప కూడా కనిపించలేదు. తమ పాప ఎక్కడంటూ సిబ్బంది అడగ్గా వార్డులోనే ఉంచి తాము భోజనానికి వెళ్లామని నిర్లక్షపు సమాధానం ఇచ్చారు. పాప కోసం చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ లేకపోవడంతో చేసేదేం లేక బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలన..

అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్​ని పరిశీలించారు. అందులో ఓ మహిళ బుర్కా ధరించి పసికందును వేగంగా తీసుకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. సీఐ బీటీ నాయక్ ఆధ్వర్యంలో పాప కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పాప అదృశ్యం అయిందంటూ బాధితులు ఆరోపించారు. తన బిడ్డను తనకు అప్పగించాలని బాలింత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి:

MURDER: బసినేపల్లిలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు

ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఇద్దరు మృతి

Last Updated : Aug 29, 2021, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.