మూగ యువతిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

author img

By

Published : May 15, 2022, 7:43 AM IST

Updated : May 15, 2022, 2:50 PM IST

rape

07:42 May 15

Rape: తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Rape on Dumb young woman in Tenali: రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మద్యం మత్తులో తరచుగా ఏదో ఒక ప్రాంతంలో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో మాటలు రాని యువతిపై అత్యాచారం జరిగింది. జకరయ్య అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం దురాగతానికి ఒడిగట్టాడని చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తెనాలి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఇంటి వద్ద ఉండే జకరయ్య అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే యువతిపై జకరయ్య అత్యాచారం చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

KGF WEAPON: ఇదో నయా ట్రెండ్​... హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా

కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్​ మృతి

పోర్న్​ ఇండస్ట్రీని ఏలిన ఈ శృంగార తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

Last Updated :May 15, 2022, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.