ETV Bharat / crime

సిటీ బస్సులో సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ వీరంగం.. అడ్డొచ్చిన వారిపై దాడి..కట్​చేస్తే పోలీస్​స్టేషన్​లో..!

author img

By

Published : May 18, 2022, 10:29 AM IST

Rude Behavior: మనం సహజంగా బస్సుల్లో ప్రయాణించేప్పుడు మనకు కొన్ని కొటేషన్స్ కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా "పుట్​బోర్డు ప్రయాణాలు ప్రమాదకరం లేదా పుట్​బోర్డుపై నిలబడి ప్రయాణాలు చేయవద్దు" అనే అక్షరాలు మనకు దర్శనమిస్తాయి. వాటిని మనం చూస్తాము..చదువుతాము. కానీ కొందరు యువత మితిమీరిన ఆకతాయితనంతో వాటిని లెక్కచేయరు.. మరికొందరు మాత్రం బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సీఆర్​పీఎఫ్ కానిస్టేబుల్ సైతం అలానే చేశాడు.. కాదు అంతకన్న హీనంగా ప్రవర్తించాడు. అడ్డువచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

CRPF constable
సిటీ బస్సులో సీఆర్​పిఎఫ్​ కానిస్టేబుల్ వీరంగం

సిటీ బస్సులో సీఆర్​పిఎఫ్​ కానిస్టేబుల్ వీరంగం

Rude Behavior: సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ ఒకరు సిటీ బస్సులో వీరంగం సృష్టించాడు. ప్రయాణికులను చితకబాదాడు.. మహిళా కండక్టర్​ను దుర్భాషలాడాడు. దీనిని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారందరిని కొట్టాడు. చివరికి స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని అరెస్టు చేశారు. వాల్తేర్ డిపోకు చెందిన బస్సు మంగళవారం రవీంద్రనగర్ నుంచి పాతపోస్టాఫీసుకు వెళ్తుంది. హనుమంతవాక వద్ద సీఆర్​పీఎఫ్ కానిస్టేబుల్ సతీష్ బస్కెక్కాడు. బస్సు ఖాళీగా ఉన్నాసరే ఫుట్ బోర్డుపైనే నిల్చొని ప్రయాణిస్తున్నాడు. మహిళా కండక్టర్ బస్సులోకి వచ్చి కూర్చోవాలని అతన్ని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పుట్ బోర్డుపైనే నిల్చున్నాడు. తోటి ప్రయాణికులు కూడా ప్రమాదమని వారించారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ సతీష్ కండక్టర్​ను దుర్భాషలాడాడు.

బస్సులో ఉన్న బుల్లయ్య కళాశాల విద్యార్థులు కండక్టర్​ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులపై దాడిచేశాడు. కొందరు విద్యార్థులను పట్టుకొని ఈడ్చేశాడు. బస్సులో రచ్చరచ్చ చేశాడు. దీంతో డ్రైవర్ బస్సును వెంకోజీపాలెం వద్ద ఆపేసి బీట్ కానిస్టేబుల్ దృష్టికి తీసుకెళ్లారు. అతను స్థానికుల సాయంతో సతీష్ ను పట్టుకొని ఎంవీపీ స్టేషన్ కు తరలించారు. మహిళా కండక్టర్ తో పాటు బుల్లయ్య కళాశాల విద్యార్థుల ఫిర్యాదు మేరకు సీఐ రమణయ్య ఆధ్వర్యంలో ఎస్​ఐ లక్ష్మి అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.