ETV Bharat / crime

ఏటీఎంలోకి దూసుకెళ్లిన కొత్త కారు.. ఏం జరిగింది..!

author img

By

Published : Jul 27, 2022, 4:02 PM IST

CAR: ఓ వ్యక్తి కారు కొన్నాడు... ఇక పూజ చేసి కారు స్టార్ట్​ చేశాడు... నెమ్మదిగా బయల్దేరాడు.. కొత్త కారులో వెళ్తున్నామన్న ఆనందమో.. టెన్షనో తెలియదు.. అంతే కారు ఒక్కసారిగా పక్కనే ఉన్న ఏటీఎంలోకి దూసుకెళ్లింది.. అదృష్టవశాత్తూ ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖలో జరిగింది.

CAR
ఏటీఎం సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు

CAR: కారుకు పూజ చేసి రోడ్డెక్కబోయిన ఓ కారు యజమాని.. అదుపుతప్పి ఏటీఎం సెంటర్​లోకి దూసుకెళ్లాడు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిటీనగర్​లోని చర్చి వద్ద పూజా కార్యక్రమాలు పూర్తైన అనంతరం కారును నడిపే క్రమంలో.. అదుపు తప్పి పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్​లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం కావడంతో పాటు.. ఏటీఎం డోర్​ కూడా ధ్వంసమైంది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏటీఎం సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.