ETV Bharat / city

వైకాపా ప్రభుత్వం బీసీలకు మొండిచేయి చూపిస్తోంది..

author img

By

Published : Jan 22, 2021, 7:08 PM IST

వైకాపా ప్రభుత్వం బీసీలకు మొండిచేయి చూపిస్తోందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధరణ పథకం ద్వారా బీసీ కులాలకు చేయూత ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు.

tdp protest for bc loans
వైకాపా ప్రభుత్వం బీసీలకు మొండిచేయి చూపిస్తోంది

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు మొండిచేయి చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకంలో బీసీలకు చేయూత ఇచ్చామని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని కనుమరుగు చేసిందని మండిపడ్డారు.

ఎన్నికల హామీలో బీసీలకు పెద్ద పీట వేస్తామని చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు విస్మరించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి బీసీ కూలాలకు అందాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

అయోధ్య రామ మందిర నిర్మాణానికి పవన్ భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.