ETV Bharat / city

దేవస్థానంలో వేలం నిర్వహణ

author img

By

Published : Aug 19, 2020, 12:23 PM IST

సింహాచలం దేవస్థానంలో వేలం నిర్వహణ
సింహాచలం దేవస్థానంలో వేలం నిర్వహణ

విశాఖ సింహాచలం దేవస్థానంలో పలు లీజుల హక్కులకు సంబంధించి వేలం జరిగింది. దేవస్థానం ఆవరణలో జరిగిన ఈ ప్రక్రియ 26 అంశాలు నిర్వహించగా... ఐదు అంశాలకు సంబంధించి వాటాదారులు దక్కించుకున్నారు. మెుత్తం 14 లక్షల 50 వేల రూపాయలు స్వామికి ఆదాయంగా సమకూరింది.

విశాఖ సింహాచలం దేవస్థానంలో పలు లీజులు, హక్కులకు సంబంధించి మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థానం కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ ప్రక్రియలో ఏఈవోలు ఎన్‌.ఆనంద్‌కుమార్‌, కె.కె.రాఘవకుమార్‌ పాల్గొన్నారు. మొత్తంగా 26 అంశాలకు వేలం నిర్వహించగా... అయిదు అంశాలను మాత్రమే వేలంలో దక్కించుకున్నారు.

కొండ దిగువన క్యాంటీన్‌ నెం.1 నెలకు రూ.61వేలు, గోపాలపట్నంలోని బుధవారం సంత ప్రాంగణంలో పార్కింగు వసూలుకు ఏడాదికి రూ. 1,22,700, కేశఖండనశాల దుకాణం నెం.1 నెలకు రూ.36,108, కొండ దిగువన దుకాణం నెం.19/32 రూ.12వేలు, గోశాల దరి నారాయణాచార్యులు తోట ఫలసాయం అనుభవానికి ఎకరాకు రూ.15వేలకు పాటదారులు పాడుకున్నారు. మెుత్తం 14లక్షల 50వేల రూపాయల ఆదాయం స్వామి వారికి సమకూరింది. ఈ ప్రతిపాదనలను దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతికి పంపిన తర్వాత హక్కులు అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ఆ ఖజానా ఎవరిది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.