ETV Bharat / city

TDP LEADERS FIRE ON GOVERNMENT AT ANANTAPURAM : "పోలీసులు చట్టాన్ని మీరుతున్నారు"

author img

By

Published : Nov 27, 2021, 7:25 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం(TDP leaders fire on YSR Congress Paty leaders) వ్యక్తం చేశారు. పోలీసులు చట్ట ప్రకారం పని చేయకుండా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించకపోవడంపై మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు
పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు

చట్టప్రకారం పని చేయాల్సిన పోలీసులు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని తెదేపా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు(Ex.minister Kalava Srinivasulu) అరోపించారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన పార్టీ మహిళా నేత ప్రియాంకను అనంతపురం ఆస్పత్రిలో పరామర్శించారు.

కక్షసాధింపు ధోరణితో తెలుగు మహిళలపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. నంద్యాలలో నిర్మించే ప్రభుత్వ వైద్యకళాశాలకు తాము వ్యతిరేకం కాదని.. కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటు చేయడం సరికాదని మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్సీ ఎన్.ఎం.డీ. ఫరూక్ అన్నారు.

వరదప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజలకు అందుతున్న సహాయకచర్యలకు విఘాతం కలుగుతుందని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయినవారికి కోటి రూపాయలు ఇచ్చిన జగన్.. వరదబాధితులకు రూ.5లక్షలు ఇస్తారా? అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం చేస్తున్నా.. అసెంబ్లీలో అంజాద్ బాషా అబద్ధాలు చెప్పడం సరికాదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మోహమ్మద్ నసీర్ అహ్మద్ విమర్శించారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.