ETV Bharat / city

KUNA RAVI: జగన్​ సొంత మీడియాకు చెల్లించినంత కూడా రైతులకు ఇవ్వట్లేదు: కూన

author img

By

Published : Nov 16, 2021, 7:55 PM IST

kuna ravi kumar comments on input subsidy
తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్

సీఎం జగన్​ విడుదల చేసిన పెట్టుబడి రాయితీ నిధులపై తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్(tdp leader kuna ravi kumar on cm jagan) తీవ్ర విరమర్శలు చేశారు. గత రెండున్నరేళ్లలో రూ.17వేల కోట్లు నష్టం వాటిల్లితే కేవలం రూ.1070.56కోట్లు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. సొంత మీడియాకు ప్రకటనల రూపంలో చెల్లించినంత మొత్తం కూడా రైతుల పరిహారానికి చెల్లించలేదన్నారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. మీట నొక్కితే డబ్బులు సొంత మీడియాకు ప్రకటనల రూపంలో వెళ్తున్నాయి తప్పా.. రైతులకు మాత్రం సాయం దక్కట్లేదని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ (tdp leader kuna ravi kumar on cm jagan) విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రకృతి వైపరీత్యాలకు రూ.17వేలకోట్ల మేర రైతులు నష్టపోతే.. వైకాపా ప్రభుత్వం కేవలం రూ.1070.56కోట్లు మాత్రమే చెల్లించిందని కూన రవికూమార్(kuna ravikumar on input subsidy) ఆరోపించారు.

'8 తుపాన్లకు 40లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే.. రైతులకు ఒక వంతు సాయం కూడా దక్కలేదు. గులాబ్ తుపాను వల్ల 3లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే కేవలం 34వేల ఎకరాలకు రూ.22కోట్ల పరిహారం చెల్లించి సరిపెట్టారు. సొంత మీడియాకు ప్రకటనల రూపంలో చెల్లించినంత మొత్తం కూడా రైతుల పరిహారానికి చెల్లించలేదు. రైతు భరోసా, ఇన్​ఫుట్​ సబ్సిడీ చెల్లింపులు(tdp leader kuna ravi kumar comments on input subsidy to farmers), వడ్డీలేని రుణాలు ఇలా అన్ని అంశాల్లోనూ రైతుల్ని మోసగించారు. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి, రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి హామీలను ముఖ్యమంత్రి జగన్​ విస్మరించారు' అని కూన రవి కుమార్ మండిపడ్డారు.

ఇదీ చదవండి..

Crop Damage Compensation: భయం వద్దు..నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.