ETV Bharat / city

అయేషా కేసు.. ప్రభుత్వం వెంటనే పరిహారమివ్వాలి: సత్యంబాబు

author img

By

Published : May 16, 2022, 3:35 PM IST

Updated : May 16, 2022, 8:08 PM IST

Satyam Babu: ఆయేషా మీరా హత్య కేసులో కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించినందున.. పరిహారం ఇవ్వాలని మరోసారి ప్రభుత్వాన్ని సత్యంబాబు కోరారు. స్పందన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను పరిహారమివ్వాలని సత్యంబాబు కోరారు. 2 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేయని నేరానికి 9 ఏళ్లు జైలుశిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.

Satyam Babu
పరిహారం ఇవ్వాలని కోరిన సత్యంబాబు

Satyam Babu: ఆయేషా మీరా హత్య కేసులో తనను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించినందున.. తనకు పరిహారం ఇవ్వాలని ఆ కేసులో గతంలో అభియోగాలు ఎదుర్కొని నిర్దోషిగా బయటపడిన సత్యంబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. 2 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్​ను సత్యంబాబు కోరారు. విజయవాడలోని కలెక్టరేట్​లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్​తో కలసి వచ్చిన సత్యంబాబు.. కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు.

చేయని నేరానికి 9 జైలు శిక్ష అనుభవించానని.. కోర్టు నిర్దోషిగా విడుదల చేసినందుకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2017లో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్​ను కలిసి తనకు పరిహారం అందించాలని కోరానని.. ఇప్పటివరకు తనకు ప్రభుత్వం నుంచి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఎస్సీ కమిషన్ ఛైర్మన్​ను కలసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపినట్లు చెప్పారు. పరిహారం ఇవ్వాలని ఎస్సీ కమిషన్ ప్రభుత్వానికి సూచించినా.. ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడన్న న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్.. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే సత్యంబాబుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిహారం కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 16, 2022, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.