ETV Bharat / city

POWER WEIGHT LIFTER BHARAT: పవర్ వెయిట్ లిప్టర్ భరత్​ను సన్మానించిన.. మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Dec 30, 2021, 8:46 PM IST

POWER WEIGHT LIFTER BHARAT: ఆసియా క్రీడల్లో పవర్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో.. కాంస్యం సాధించిన తెలుగు క్రీడాకారుడు పందిళ్ల భరత్ కుమార్​ను మంత్రి వెల్లంపల్లి సన్మానించారు. ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు.

POWER WEIGHT LIFTER BHARAT
POWER WEIGHT LIFTER BHARAT

పవర్ వెయిట్ లిప్టింగ్​లో తెలుగోడికి కాంస్యం.. మంత్రి వెల్లంపల్లి సన్మానం

POWER WEIGHT LIFTER BHARAT: టర్కీలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన పందిళ్ల భరత్ కుమార్​ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విజయవాడలోని కెబిఎన్ కళాశాలలో.. పవర్ వెయిట్ లిప్టర్ భరత్​ను మంత్రితోపాటు కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

అంతర్జాతీయ స్థాయిలో తెలుగువాడు.. దేశం గర్వంచదగ్గ పతకం తీసుకురావడం తమకు సంతోషంగా ఉందని కళాశాల యాజమాన్యం తెలిపింది. పవర్ వెయిట్ లిప్టింగ్​లో మరింతగా రాణించేందుకు.. భరత్​కు అవసరమైన అన్ని సదుపాలయాలు ప్రభుత్వం తరపున కల్పిస్తామని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు. మూడేళ్లుగా కష్టపడి.. పతకాన్ని సాధించినట్లు క్రీడాకారుడు భరత్ పేర్కొన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. కళాశాల యాజమాన్యం సహకారంతో ముందుకు వెళ్లినట్లు చెప్పాడు.


ఇదీ చదవండి: మమ్మల్ని అవమానిస్తున్నారు.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమిస్తాం: ఉద్యోగ సంఘాల నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.