ETV Bharat / city

పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

author img

By

Published : Jun 23, 2020, 9:45 PM IST

మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మున్సిపల్​ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనా విధుల్లో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్​ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
మున్సిపల్​ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

మున్సిపల్ రంగంలో పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మున్సిపల్​ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తక్షణమే కాంట్రాక్ట్, ఔట్​ సోర్స్​ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర రావు కోరారు.

కార్మికులను సచివాలయాలకు బదలాయించడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలో వస్తే కాంట్రాక్టు, ఔట్​సోర్స్​ కార్మికులు, ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పిన హామీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కరోనా విధుల్లో పని చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కరోనా విధుల్లో మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేసినా ఇప్పటివరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు.

ఇదీ చూడండి: అత్తారింట్లోకి దారేది... పది రోజులుగా గేటు వద్దే కోడలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.