ETV Bharat / city

'మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ అధీనంలోకి తీసుకురావొద్దు'

author img

By

Published : Jun 1, 2022, 6:10 PM IST

మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ అధీనంలోకి తీసుకురావొద్దు
మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ అధీనంలోకి తీసుకురావొద్దు

మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ అధీనంలోకి తీసుకురావటంపై మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు 17 డిమాండ్లతో పురపాలక, విద్యాశాఖల అధికారులకు ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.

పాఠశాలల విలీనంలో భాగంగా మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోకి తీసుకురావొద్దని డిమాండ్ చేస్తూ.. పురపాలక, విద్యాశాఖలకు మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రొగ్రెసివ్ మున్సిపల్ టీచర్ల అసోసియేషన్ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్​కు అందజేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం విద్యాశాఖాధికారి సూపర్​వైజర్ పోస్టుల ద్వారా మాత్రమే పురపాలక పాఠశాలల్లో పర్యవేక్షణ చేసేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశాయి. మున్సిపల్ టీచర్లకు సాధారణ బదిలీలు, జీపీఎఫ్ ఖాతాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పీఎంటీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు విజ్ఞాపన పత్రం ఇచ్చారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.