ETV Bharat / city

పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్.. కొట్టుకుపోయిన ధాన్యం

author img

By

Published : Apr 7, 2021, 5:09 PM IST

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మిషన్​ భగీరథ పైప్​లైన్​ వాల్వు పగిలి కొట్టుకుపోయింది. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లా రుద్రూరులో జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

mission bhagiratha pipeline broken
మిషన్​ భగీరథ పైప్​లైన్​కు లీకేజ్

మిషన్​ భగీరథ పైప్​లైన్​కు లీకేజ్

మిషన్‌ భగీరథ పైపు వాల్వు పగిలి ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిన ఘటన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భారీగా ఉప్పొంగిన నీటి ప్రవాహానికి రుద్రూర్‌లోని బోధన్ - బాన్సువాడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఎండబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది.

సుమారు 20 ఎకరాల ధాన్యం వరదలో కొట్టుకుపోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని రైతులు వాపోయారు. కష్టపడి పండించిన ధాన్యం అంతా నీటి పాలు అయిందని అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి:

ఆకలిదప్పులు తీరుస్తూ.. నాలుగేళ్లుగా అన్నీ తానై నిలుస్తూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.