సినిమాటోగ్రఫీ చట్టం మేరకు టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది: పేర్ని నాని

author img

By

Published : Jan 10, 2022, 5:03 PM IST

Updated : Jan 10, 2022, 7:46 PM IST

సినిమాటోగ్రఫీ చట్టం మేరకు టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది

16:59 January 10

నిర్మాత ఆర్‌జీవీతో చర్చల వివరాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని

సినిమాటోగ్రఫీ చట్టం మేరకు టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది

Minister Perni Nani On Cinema Tickets: సినిమాటోగ్రఫీ చట్టం మేరకు టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. టికెట్ ధరల విషయంలో తమ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ పరిశ్రమ వ్యక్తిగా ఆర్‌జీవీ తన అభిప్రాయాలు చెప్పారన్నారు. ఆర్‌జీవీ చెప్పిన వాటిని ఉన్నతస్థాయి కమిటీకి అందిస్తామని తెలిపారు.

సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం జీవో 35 ద్వారా ధరలు నిర్దేశించామని మంత్రి పేర్ని స్పష్టం చేశారు. తాము ఎక్కడా చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకోలేదన్నారు. అందరికీ వర్తించే నిబంధనలనే ఇప్పుడు గుర్తు చేస్తున్నామని చెప్పారు. ధర సమీక్షకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కరోనా వల్లే ఆర్‌ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్ చిత్ర బృందాలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారని తెలిపారు.

"సినీ పరిశ్రమ వ్యక్తిగా ఆర్‌జీవీ తన అభిప్రాయాలు చెప్పారు. ఆర్‌జీవీ చెప్పిన వాటిని ఉన్నతస్థాయి కమిటీకి అందిస్తాం. సినిమాటోగ్రఫీ చట్టం మేరకు టికెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సినిమా టికెట్ ధరలో మా ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు. అందరికీ వర్తించే నిబంధనలనే ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. కరోనా వల్లే ఆర్‌ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్ వాయిదా వేసుకున్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం జీవో 35 ద్వారా ధరలు నిర్దేశించాం. మేం ఎక్కడా చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకోలేదు. ధర సమీక్షకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో కమిటీ వేశాం. కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది." -పేర్ని నాని, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

థియేటర్లలో ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ

సినిమా థియేటర్లల్లో ఆన్​లైన్ టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆన్​లైన్ టికెటింగ్ కోసం అవసరమైన వెబ్​సైట్ రూపకల్పనపై అధికారులతో మంత్రి పేర్ని సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరలో ఏపీలోని సినీ థియేటర్లల్లో ఆన్​లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించాలని భావిస్తోందని మంత్రి తెలిపారు.

సినిమా రంగం దెబ్బతింటోంది..

సినిమా టికెట్‌ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి పేర్ని నానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ నిర్మాతగా తన అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చానన్నారు. టికెట్‌ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానన్న ఆయన.. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించినట్లు తెలిపారు. థియేటర్ల మూసివేతపై భేటీలో ఎలాంటి చర్చా జరగలేదని చెప్పారు. తాను చిత్ర పరిశ్రమ తరఫున చర్చలకు రాలేదని.., కేవలం తన వాదన వినిపించేందుకే వచ్చానని ఆర్జీవీ స్పష్టం చేశారు.

"సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం నాకుంది. టికెట్‌ ధర తగ్గిస్తే.. ఆ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై చర్యలు తీసుకోవచ్చు. పవన్‌, బాలకృష్ణను ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని అనుకోను. ఒకరిద్దరి కోసం మొత్తం పరిశ్రమను ఇబ్బంది పెడతారనుకోను. ఆర్ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్ వాయిదాకు టికెట్‌ ధరలే కారణం కావొచ్చు. "- ఆర్జీవీ

ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి నానితో చెప్పానని ఆర్జీవీ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉందో వివరించానన్నారు. టికెట్‌ ధరలు పెరిగితే జనం ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారని తెలిపారు. సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండింటిపైనా ఉందన్నారు. మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావించారని వెల్లడించారు.

"టికెట్‌ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. టికెట్‌ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించా. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదు. నా వాదన వినిపించేందుకే వచ్చా. మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావించారు. ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని చెప్పా. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉందో వివరించా. టికెట్‌ ధరలు పెరిగితే జనం ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారు. అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుంది.సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండింటిపైనా ఉంది." -ఆర్జీవీ దర్శకుడు

ఇదీ చదవండి: టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. ఆ హీరోలను టార్గెట్‌ చేశారనుకోను: ఆర్జీవీ

Last Updated :Jan 10, 2022, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.