ETV Bharat / city

South Central Railway: దసరాకు ఊరెళ్తున్నారా? ప్రత్యేక రైళ్ల వివరాలివే..

author img

By

Published : Oct 14, 2021, 8:08 PM IST

దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. వాటి వివరాలతో కూడిన పట్టికను విడుదల చేసింది.

festival special trains
festival special trains

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, రైలు నంబర్‌, ఏ స్టేషన్‌లో ఎన్ని గంటలకు బయల్దేరుతుంది.. గమ్యస్థానానికి చేరే సమయమెంత? తదితర వివరాలు ఇవిగో..! లాక్‌డౌన్‌ తరువాత రైల్వేలు పూర్వపుస్థాయిలో రైలు సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. రెగ్యులర్‌ సర్వీసులకే స్పెషల్స్‌ అని నడిపిస్తున్న విషయం తెలిసిందే.

దసరా స్పెషల్ రైళ్ల వివరాలు..

ఇదీ చదవండి:

KANNABABU: విద్యుత్ కోతలపై తెదేపా అసత్య ప్రచారం: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.