ప్రారంభమైన దసరా ఉత్సవాలు..తొలిరోజు స్వర్ణకవచాలంకృత రూపం

author img

By

Published : Sep 26, 2022, 10:59 AM IST

Dussehra celebrations started at Vijayawada

DUSSEHRA AT VIJAYAWADA : విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

DUSSEHRA : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్‌కు మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి సుమంగళ ద్రవ్యాలను గవర్నర్‌ దంపతులు సమర్పించారు. బిశ్వభూషణ్​ దంపతులతు పండితులు వేదాశ్వీరచనం చేసి.. పట్టు వస్త్రాలు అందించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని.. తన కుటుంబంతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలపై అమ్మవారు కరుణ చూపాలని కోరుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నా కుటుంబంతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలపై అమ్మవారు కరుణ చూపాలి -బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.