ETV Bharat / city

CPI Ramakrishna on YCP schemes : మీ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో చెప్పగలరా: సీపీఐ రామకృష్ణ

author img

By

Published : Jan 2, 2022, 2:50 PM IST

CPI Ramakrishna on YCP schemes
మీ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో చెప్పగలరా -రామకృష్ణ

CPI Ramakrishna on YCP schemes : వైకాపా ప్రభుత్వం పాత పథకాలనే కొత్తగా ప్రవేశపెట్టినట్టు హడావుడి చేస్తోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు.

CPI Ramakrishna on YCP schemes : వైకాపా ప్రభుత్వం పాత పథకాలను కొత్తగా తీసుకువచ్చినట్లుగా హడావుడి చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జనవరి 1వ తేదీన పెన్షన్ పథకానికి అట్టహాసంగా ప్రకటనలు ఇచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. పెన్షన్ 3వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తరువాత 250 రూపాయలు పెంచి.. అదేదో కొత్త పథకం తెచ్చినట్టు హడావిడి చేశారని ఎద్దేవా చేశారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. పేదలకు ఇళ్ల స్థలాల పథకంలో వైకాపా ఎమ్మెల్యేల దగ్గర నుంచి అధికారుల దాకా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిని ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు.

అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలుసన్న రామకృష్ణ.. రెండున్నరేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా? అని నిలదీశారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఏ ఒక్కదానిలో అయినా ముందడుగు వేశారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి దక్కాల్సిన గంగవరం ప్రాజెక్టు అదానీకి అప్పగించారని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో ప్రధానికి కనీసం వినతి పత్రమైనా ఇచ్చారా? అని నిలదీశారు. గడిచిన రెండేళ్లలో అంగుళం అభివృద్ధి అయినా జరిగిందా..? కనీసం రహదారులు అయినా వేశారా? అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి : Police Cardan Search : ప్రకాశం జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్... పలు వాహనాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.