ETV Bharat / city

CM JAGAN: వర్షాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్​.. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం

author img

By

Published : Nov 19, 2021, 11:17 AM IST

Updated : Nov 19, 2021, 12:35 PM IST

సీఎం జగన్
సీఎం జగన్

భారీ వర్షాల నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సూచించారు.

భారీ వర్షాలపై చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తిరుపతిలో వరదనీటి నిల్వకు కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్...ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు గండ్లు పడినచోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఆయా జిల్లాలకు అదనంగా నిధులు మంజూరు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

పంటనష్టం అంచనా వేయాలి..

ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా భక్తులను కొండపైనే ఉంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తిరుమల భక్తులకు రైళ్లు, విమానాలు రద్దయినందున కనీసం ఒకటి, రెండు రోజులు భక్తులకు వసతులు సమకూర్చాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తిరుమల యాత్రికులకు అండగా నిలవాలని సూచించారు. తిరుపతిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వివరించారు. కడప జిల్లాలో గండిపడిన చెరువుల్లో యుద్ధప్రాతిపదికన సురక్షిత చర్యలు చేపట్టాలని వెల్లడించారు. విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వరదనీరు తగ్గగానే అధికారులు పంట నష్టాన్ని లెక్కించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వీలైనంత త్వరగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ వీడియోకాన్ఫరెన్స్​లో అధికారులను ఆదేశించారు.

ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలి. వర్షాల తర్వాత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా భక్తులను కొండపైనే ఉంచాలి. తిరుమల యాత్రికులకు అండగా నిలవాలి. విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. వరదనీరు తగ్గగానే అధికారులు పంట నష్టాన్ని లెక్కించాలి. వీలైనంత త్వరగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందించాలి. -వై.ఎస్.జగన్మోహన్​రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ప్రత్యేక అధికారుల నియామకం...

భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు... గురువారం రాత్రి అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు. భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో చేపట్టవలసిన సహాయ చర్యలను అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. వాటిని నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందిస్తారు. నెల్లూరు జిల్లాకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, కడప జిల్లాకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

ఇదీచదవండి.

Last Updated :Nov 19, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.