ETV Bharat / city

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది: చింతా మోహన్

author img

By

Published : Dec 23, 2019, 2:50 PM IST

chintha mohan press meet in tirupathi
చింతా మోహన్

రాష్ట్ర పరిపాలన గాడి తప్పుతోందని.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు రాజకీయ కక్షలతో సాగుతోందే తప్ప ప్రజాపాలన దిశగా లేదన్నారు.

చింతా మోహన్

రాష్ట్ర పరిపాలన గాడి తప్పుతోందనీ.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారులు పేరుకే ఉన్నారని.. వారి నిర్ణయాలు వైకాపా నాయకుల చేతుల్లో ఉంటాయని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పాలన కనుమరుగైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు రాజకీయ కక్షలతో సాగుతోంది తప్ప ప్రజాపాలన దిశగా సాగడంలేదని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరుగుతోందని.. మేధావుల ఆలోచనలను అనుసరించి ప్రజలకు మంచి జరిగే విధంగా చూడాలని సూచించారు. తిరుపతిలో గరుడ వారధి పనులు త్వరితగతిన పూర్తి చేసి దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

ఇవీ చదవండి

అరెస్టు చేద్దామని వచ్చి.. ఆందోళనలతో వెనక్కి తగ్గారు!

Intro:తిరుపతి ప్రెస్క్లబ్లో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ప్రెస్ మీట్


Body:ap_tpt_36_23_chintamohan_press_meet_avb_ap10100

రాష్ట్ర పరిపాలన గాడి తప్పుతుంది అని, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారులు పేరుకే తప్ప వారి నిర్ణయాలు వైకాపా నాయకుల చేతుల్లో ఉంటాయని దుయ్యబట్టారు. కనీసం మంత్రులకు కూడా మాట్లాడే అవకాశం ఈ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం లేదని..... కేవలం సిఫార్సు చేయడం తప్ప శాసించే అధికారం ఇక్కడ లేదని.... ప్రజాస్వామ్య పాలన కనుమరుగై పోతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇప్పటివరకు నాలుగు సార్లు మారిందని ఐదు సార్లు కూడా మారుతుందని ఆయన ఎద్దేవా చేశారు. జుడిషియల్ రాజధాని ఎక్కడికి మారదని, కర్నూల్కి మార్చడానికి రాష్ట్రానికి ఏ హక్కు ఉందని.... సుప్రీంకోర్టు మాత్రమే ఆ విషయాలు నిర్ణయిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు రాజకీయ కక్షలతో సాగుతుంది తప్ప ప్రజా పాలన జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తిరుమల- తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ కార్పొరేట్ సంస్థ గా మారిపోయిందని.... వేలకు వేలు డబ్బులు పెట్టి దర్శనాలు కొనుక్కునే దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని అన్నారు. పేరుకే తిరుపతి దేవస్థానం తప్ప తిరుపతిలో ఉన్న స్థానికులకు దర్శనాలు తీసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరుగుతుందని...... మేధావుల ఆలోచనలను అనుసరించి ప్రజలకు మంచి జరిగే విధంగా చూడాలని అని ముఖ్యమంత్రిని కోరారు. తిరుపతిలో గరుడ వారధి పనులు త్వరితగతిన పూర్తి చేసి దేశ, విదేశాల నుండి వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కోరారు.రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు విద్యా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యా విధానం పూర్తిగా అధ్వాన స్థితికి చేరుకుందని ఆయన మండిపడ్డారు .


Conclusion:పి. రవి కిషోర్. చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.