ETV Bharat / city

Woman Commits Suicide in Kadapa: తండ్రి మందలించాడని.. ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

author img

By

Published : Jan 2, 2022, 1:55 AM IST

Updated : Jan 2, 2022, 7:45 AM IST

Young Woman Commits Suicide in Kadapa: తండ్రి మందలించాడని మనస్తాపంతో ఉరి వేసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడపలోని రామకృష్ణ నగర్​లో చోటుచేసుకుంది.

Woman Commits Suicide in Kadapa
Woman Commits Suicide in Kadapa

Young Woman Commits Suicide in Kadapa: తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కడపలోని రామకృష్ణ నగర్​లో చోటుచేసుకుంది. రామకృష్ణ నగర్​కు చెందిన విజయలక్ష్మి.. ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంట్లో ఉంటుంది. ఇటీవల కాలంలో తల్లి మృతిచెందింది.

తండ్రి చంద్రతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో బయటికి వెళ్లి విజయలక్ష్మి ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

Two minor girls raped at kurupam: విజయనగరం జిల్లాలో ఇద్దరు బాలికలపై అత్యాచారం

Last Updated : Jan 2, 2022, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.