ETV Bharat / city

KOPPARRU INCIDENT: కొప్పర్రు ఘటన బాధ్యులను అరెస్టు చేశాం: ఎస్పీ విశాల్ గున్నీ

author img

By

Published : Sep 21, 2021, 3:11 PM IST

Updated : Sep 21, 2021, 4:17 PM IST

RURAL SP VISHAL GUNNY ON KOPPARRU INCIDENT
RURAL SP VISHAL GUNNY ON KOPPARRU INCIDENT

15:03 September 21

RURAL SP VISHAL GUNNY ON KOPPARRU INCIDENT

గుంటూరు జిల్లా కొప్పర్రు ఘటన (KOPPARRU INCIDENT)పై రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ.. ఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, వారిపై సంబంధిత సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి బాపట్ల రూరల్ సీఐ, పొన్నూరు రూరల్, పట్టణ సీఐలతో మూడు బృందాలను బాపట్ల డీఎస్పీ ఏర్పాటు చేశారని అన్నారు. 

అదుపులోకి అనుమానితులు..

ఈ ఘటనకు సంబంధించి 16 మంది అనుమానితులను విచారణ నిమిత్తం పెదనందిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా FIR- 109/2021, 110/2021 కింద పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై నిష్పక్షపాతంగా.. చట్ట పరిధిలో విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ విశాల్ తెలిపారు. కేసుకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీమ్ సేకరిస్తోందని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఏం జరిగిందంటే..

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా సభ్యులు ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఊరేగింపు తెదేపా నేతల ఇళ్ల సమీపంలోకి రాగానే గొడవ మొదలైంది. ఇళ్లముందు కూర్చుని ఉన్న తెదేపా వర్గీయులపై రాళ్ల దాడి జరిగింది. వారు కూడా ధీటుగా స్పందించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆ సమయంలో పెదనందిపాడు ఎస్సై నాగేంద్రతోపాటు ఐదారుగురు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో గొడవను నియంత్రించడం సాధ్యం కాలేదు.

తెదేపా వర్గీయులతోపాటు ఎస్సైకూడా ప్రాణరక్షణకోసం తెదేపా మాజీ జడ్పీటీసీ శారద ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత 100మంది వరకు వైకాపా వర్గీయులు మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై దాడికి దిగారు. రాళ్లతో కిటికీలు, తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కిటికీలు పగిలి పోవడంతో రాళ్లు లోపలికి వెళ్లి అక్కడ ఉన్నవారికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆ ఇంటిముందున్న ఆరు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టారు. డీజిల్‌, కిరోసిన్‌ పోసి ఇంట్లో ఉన్నవారిని కూడా బయటకు రాకుండాచేయాలని ప్రయత్నించారు. లోపల ఉన్నవారంతా గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కరెంట్‌ మీటర్‌ వద్ద ఫీజులు తీసివేయడంతో చీకట్లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు కొప్పర్రులో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అండగా ఉంటాం..

మూడు రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్​ను కూడా చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

అనుబంధ కథనాలు..

Last Updated :Sep 21, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.